City of twins: ప్రపంచంలో కవలల జనాభా అధికంగా ఉన్న నగరం ఎక్కడుందో తెలుసా..? అక్కడ ప్రతీ ఇంటిలో కవలలే.. అలా ఎందుకంటే?

ప్రపంచంలో బ్రెజిల్‌కు చెందిన కాండిడో గోడోయ్, ఈజిప్ట్‌కు చెందిన అబుఅత్వా, యుక్రెయిన్‌కు చెందిన వెలికాయ కోపన్యా, భారతదేశంలో కేరళ రాష్ట్రం కోడిన్హి అనే గ్రామంలో కవలలు ఎక్కువగా ఉన్నారు. అయితే, ఇగ్బో- ఓరా నగరంలో కంటే చాలా తక్కువనే చెప్పాలి. ఇక్కడ వెయ్యి జననాల్లో 158 జననాలు కవలలే కావటం గమనార్హం.

City of twins: ప్రపంచంలో కవలల జనాభా అధికంగా ఉన్న నగరం ఎక్కడుందో తెలుసా..? అక్కడ ప్రతీ ఇంటిలో కవలలే.. అలా ఎందుకంటే?

Twins Town

City of twins: ఒకేకాన్పులో కవలలు జన్మించడం మనం అరుదుగా చూస్తుంటాం. వారిలో కొందరు అచ్చం ఒకేరూపాన్ని కలిగి ఉంటారు. వారిని గుర్తుపట్టడం చాలా కష్టమైన పనే. మన కంటికి సరిగ్గా పనిచెబితేకాని వారిని పేర్లతోసహా గుర్తుపట్టడం సాధ్యంకాదు. ఒకరిద్దరు కవలలు ఉంటేనే కన్ఫ్యూజ్ అయితే.. నగరంలో ఇంటింటికి కవలలు ఉంటే. ఆప్పుడు మన ఫరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటమే కష్టం. ప్రపంచంలో కవలలు ఎక్కువగా ఉన్న నగరాలు అనేకం ఉన్నాయి. అయితే, నైజీరియాలోని ఇగ్బో-ఓరా నగరంలో దాదాపు ఇంటింటికి కవలలు ఉంటారు. ఇక్కడ జనాభా 2.78లక్షలు. ప్రతీ వెయ్యి మంది జనాభాలో 158 మంది కవలలు ఇక్కడ ఉంటారు. అందుకే దీనిని ప్రపంచంలోనే జంట రాజధాని అనికూడా పిలుస్తారు.

5th time Twins : 5వ సారి కూడా కవలలకు జన్మనిచ్చిన భార్య..బెంబేలెత్తి వదిలేసిపోయిన భర్త

నైజీరియాలోని అతిపెద్ద నగరమైన లాగోస్‌కు దక్షిణవంగా 135 కిలోమీటర్లు దూరంలో ఈ ఇగ్బో-ఓరా నగరం ఉంటుంది. ఈ నగరంలో మనం ఎక్కడికివెళ్లిన ఒకేవ్యక్తి రెండు సార్లు కనిపిస్తున్నాడా అనే భ్రమల్లోకి వెళ్లిపోతాం. వీధుల్లో నడుచుకుంటూ వెళ్లినా, పార్కుల్లో, షాపింగ్ ప్రాంతాల్లో ఇలా ఆ నగరంలో ఎక్కడికి వెళ్లినా ఒకే రూపంలోఉన్న ఇద్దరు మనుషులు మనకు ఒకేసారి కనిపిస్తారు. ఈ ప్రాంతంలో రైతులు, చిరు వ్యాపారుల కుటుంబాలు ఎక్కువగా నివసిస్తాయి. ఓ సర్వే ప్రకారం.. ప్రపంచ జనాభాలో దాదాపు 1.9శాతం మంది కవలలు ఉన్నారు. కానీ, ఇగ్బో-ఓరాలో దాదాపు ప్రతీ కుటుంబం కవలలతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో మహిళల ఆహారపు అలవాట్ల వల్ల ఇక్కడ కవలలు పుట్టడం చాలా ఎక్కువ అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Delivered Twins:ప్రసవించిన ట్విన్స్..అక్కకు నలుగురు..చెల్లికి ముగ్గురు

ప్రతీయేటా ఈ నగరంలో కవలల పండుగను నిర్వహిస్తారు. ఇందులో వెయ్యి కంటే ఎక్కువ మంది కవల జంటలు పాల్గొంటారు. ఫ్రాన్స్, చుట్టుపక్కల దేశాల నుంచి కూడా ఈ పండుగలో పాల్గొనడానికి ఇక్కడికి వస్తారు. కవలల జననాల రేటు యూరప్, అమెరికాతో పోల్చినట్లయితే.. ఇక్కడ చాలా ఎక్కువ. ప్రతీ వెయ్యి జననాలకు ఐరాపోలో 16 కవలలు, అమెరికాలో 33 కవలల జననాలు ఉంటాయి. కానీ ఇగ్భో- ఓరాలో ప్రతీ వెయ్యి జననాల్లో 158 జననాలు కవలలే ఉంటారు.

 

ప్రపంచంలో ఎక్కువగా ప్రసిద్ధి చెందిన నగరాల్లో బ్రెజిల్‌కు చెందిన కాండిడో గోడోయ్, ఈజిప్ట్‌కు చెందిన అబు అత్వా, యుక్రెయిన్‌కు చెందిన వెలికాయ కోపన్యా, భారతదేశంలో కేరళ రాష్ట్రం కోడిన్హి అనే గ్రామంలో కవలలు ఎక్కువగా ఉంటారు. అయితే, ఇగ్బో- ఓరా నగరంలో కంటే చాలా తక్కువనే చెప్పాలి. కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా కోడిన్హిలో 2వేల కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ 400కుపైగా కవల సోదరులు, సోదరీమణులు ఉంటారు. భారత దేశంలో సగటున వెయ్యి జననాల్లో తొమ్మిది జననాలు కవలలు జన్మిస్తారు. అయితే కోడిన్హిలో వెయ్యి జనాభాకు సగటున 45 జననాలు కవలలే ఉంటారు.