3నెలల వ్యవధిలో 2సార్లు డాక్టర్‌కు కరోనా పాజిటివ్

  • Published By: naveen ,Published On : July 20, 2020 / 11:21 AM IST
3నెలల వ్యవధిలో 2సార్లు డాక్టర్‌కు కరోనా పాజిటివ్

ఒక్కసారి కరోనా వస్తేనే వామ్మో అంటున్నారు. ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అలాంటిది రెండు సార్లు కరోనా సోకితే.. ఊహించడానికే భయంగా ఉంది కదూ. కానీ, కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆ డాక్టర్ విషయంలో అదే జరిగింది. 3 నెలల వ్యవధిలో రెండు సార్లు ఆ డాక్టర్ కు పాజిటివ్ వచ్చింది. ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ లో ఈ ఘటన జరిగింది.

At the Front Lines of Coronavirus, Turning to Social Media - The ...

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌కు రెండుసార్లు పాజిటివ్:
ఆ డాక్టర్ రమత్ గన్స్ షేబా మెడికల్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఆసుపత్రి ఇజ్రాయిల్ దేశంలోనే అతి పెద్దది. కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కరోనా రోగులకు ట్రీట్ మెంట్ ఇస్తున్న డాకర్ట్ రెండుసార్లు కరోనా బారిన పడ్డాడు. అయితే ఆ డాక్టర్ వివరాలను వెల్లడించ లేదు. తొలుత ఏప్రిల్ నెలలో ఆ డాక్టర్ కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత చికిత్స తీసుకుని కోలుకున్నాడు. మే, జూన్ నెలలో మరోసారి కరోనా టెస్టులు చేశారు. నెగిటివ్ అని వచ్చింది. ఆ తర్వాత జూలైలో మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ టెస్టులో పాజిటివ్ అని వచ్చింది.

Sheba Medical Center COVID-19

రెండోసారి కరోనా సోకడం చాలా అరుదు:
ఒక్కసారి కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ కరోనా బారిన పడటం చాలా అరుదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ కొవిడ్ రాదని చాలామంది నమ్ముతున్నారు. దీనికి కారణం శరీరంలో ఏర్పడే యాంటీ బాడీస్. వాటి కారణంగా మరోసారి కరోనా రాదనే అభిప్రాయం ఉంది. ఇజ్రాయిల్ దేశంలోనూ ఇలాంటి కేసులు లేవు. కాగా, కరోనా రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్న కారణంగా డాక్టర్లు రిస్క్ లో పడుతున్నారు. వారికి మళ్లీ మళ్లీ వైరస్ అటాక్ అవుతోంది.

What are coronavirus antibodies and how can I get tested for them ...

యాంటీ బాడీస్ 3 నెలల మాత్రమే పని చేస్తాయా?
కరోనా నుంచి కోలుకున్న బాధితులు మరోసారి వైరస్ బారిన పడుతున్న కేసులు గత మూడు నెలలుగా దక్షిణ కొరియా, కెనడా, అమెరికా దేశాల్లో వెలుగు చూస్తున్నాయి. ఈ తరహా కేసులతో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. ఆ వ్యక్తుల్లోని రోగనిరోధక శక్తిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కరోనా వచ్చి పోయాక శరీరంలో యాంటీ బాడీస్ తయారవుతాయి. ఈ కారణంగా మరోసారి కరోనా వచ్చే అవకాశం ఉండదనే అభిప్రాయం ఉంది. కానీ ఈ ప్రత్యేక కేసులను చూస్తే, శరీరంలో ఏర్పడ్డ యాంటీ బాడీస్ భవిష్యత్తులో కొత్త ఇన్ ఫెక్షన్స్ రాకుండా అడ్డుకోగలవు అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. లేదంటే కరోనా వచ్చి పోయాక బాడీలో తయారైన యాంటీ బాడీస్ కొన్ని నెలల వరకు మాత్రమే ప్రభావవంతంగా పని చేస్తాయని నమ్మాల్సి ఉంటుంది. మొత్తంగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్ల కరోనా సోకడం హాట్ టాపిక్ గా మారింది. యాంటీ బాడీస్, రోగనిరోధక శక్తి గురించి చర్చ జరుగుతోంది.