హ్యాట్సాఫ్ డాక్టర్ : రోగిని కాపాడటానికి మూత్రాన్ని నోటితో బైటకు తీశాడు 

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 06:02 AM IST
హ్యాట్సాఫ్ డాక్టర్ : రోగిని కాపాడటానికి మూత్రాన్ని నోటితో బైటకు తీశాడు 

డాక్టర్ ని దేవుడితో సమానమంటాం. రోగులకు డాక్టర్ పునర్జన్మనిస్తాడు కాబట్టి. డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులు చనిపోయారనే ఆందోళనలకు మనం చూస్తుంటాం..వింటుంటాం. కానీ వృత్తికి అంకితమైన డాక్టర్లు పేషెంట్లను కాపాడేందుకు ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. అది వారి వృత్తి పట్ల ఉన్న కమింట్ మెంట్. అటువంటి ఓ డాక్టర్  విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఓ వ్యక్తిని కాపాడేందుకు ఏకంగా ఆ వ్యక్తి మూత్రాన్ని (యూరిన్)ను నోటితో బైటకు తీసాడు. దీంతో సదరు వ్యక్తి ప్రాణాపాయం నుంచి బైటపడ్డాడు. 

వివరాల్లోకి వెళితే..చైనాలోని జువాంగ్‌జౌ నగరం నుంచి ఓ విమానం న్యూయార్క్‌ విమానం బయల్దేరింది. ఆ విమానంలో 70 ఏళ్ల వ్యక్తి సడెన్ గా పొత్తికడుపు పట్టుకుని బాధతో విలవిల్లాడుతున్నాడు. అదే విమానంలో ఉన్న డాక్టర్ జాంగ్‌ హాంగ్‌ అది గమనించారు. వెంటనే విషయం ఏమిటని అడిగారు. 

ప్రొస్ట్రేట్‌ గ్రంధి సమస్యతో అతను బాధపడుతున్నారని..తరచూ మూత్రాశయం నుంచి మూత్రాన్ని క్లియర్‌ చేయాలని బంధువులు తెలిపారు. మూత్రాన్ని క్లియర్ చేయకపోతే అతని ప్రాణానికే ప్రమాదం. కానీ విమానాన్ని ల్యాండింగ్ చేసే పరిస్థితి లేదు. దాంతో డాక్టర్ జాంగ్ హాంగ్ ఏమాత్రం ఆలోచించలేదు. డాక్టర్ జాంగ్ పేషెంట్‌ మూత్ర ద్వారానికి  ఓ ప్లాస్టిక్‌ ట్యూబ్‌ పెట్టి  మూత్రాన్ని స్వయంగా తన నోటితో పీలుస్తూ..బైటకు తీశారు. అలా 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని బైటకు తీసి  ఆ మూత్రాన్ని ఓ ఖాళీ వైన్‌ బాటిల్‌ పోస్తూ మూత్రాశయాన్ని క్లియర్ చేశారు. అలా చేయకుంటే పేషెంట్‌ కోమాలోకి వెళ్లి చనిపోయే ప్రమాదముందని డాక్టర్‌ చెప్పారు. అలా చేయటంతో అతను ప్రాణాప్రాయం నుంచి బైటపడ్డాడు. ఈ విషయం తెలిసాక డాక్టర్  జాంగ్‌ హాంగ్‌ అభినందించకుండా ఉండగలమా..అందుకే హ్యాట్యాష్ టూ యూ డాక్టర్ జాంగ్ హాంగ్.