బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు : కరోనాతో నేను చనిపోతే…డాక్టర్ల దగ్గర ఫ్లాన్స్ ఉన్నాయి

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2020 / 07:58 AM IST
బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు : కరోనాతో నేను చనిపోతే…డాక్టర్ల దగ్గర ఫ్లాన్స్ ఉన్నాయి

కరోనా వైరస్ సోకి హాస్పిటల్ లో ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న పరస్థితులను బ్రిటన్ ప్రధాని వివరించారు. “ది సన్” అనే ట్యాబ్లాయిడ్ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోరిస్ జాన్సన్ పలు కీలక విషయాలను చెప్పారు. హాస్పిటల్ లో ఉన్న సమయంలో తాను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని బ్రిటన్ ప్రధాని తెలిపారు.ఒకానొక సమయంలో తమ పరిస్థితి అటా ఇటా అన్నట్టు ఉందని, చావు అంచుల వరకూ వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు. అనుకోనిది ఏదైనా జరిగితే ఏం చేయాలనేదానిపై డాక్టర్లు ప్రణాళికలు వేసుకున్నారని కూడా ఆయన చెప్పారు. 

బోరిస్ మాట్లాడుతూ….అది చాలా క్లిష్టమైన పరిస్థితి. నాకేమైనా జరిగితే ఏం చేయాలనే దానిపై వైద్యులు అన్ని రకాల ఏర్పాట్లూ చేసుకున్నారు. కేవలం కొద్ది రోజుల వ్యవధిలో నా ఆరోగ్యం ఇంతగా దిగజారిందనేది అస్సలు నమ్మలేకపోతున్నాను. నన్ను నిరాశ ఆవరించింది. నా ఆరోగ్యం ఎందుకు మెరుగుపడట్లేదనేది నాకు అర్థం కాలేదు. ఒకోనాక స్థితిలో పరిస్థితి 50-50కి చేరుకుంది. నేను ఒకవేళ చనిపోతే ఏమి చేయాలో.. వైద్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు బ్రిటన్ ప్రధాని.

డాక్టర్ల దగ్గర ఆకస్మిక ఫ్లాన్ లు ఉన్నాయని తనకు అర్థమయిందన్న బ్రిటన్ ప్రధాని…తాను చనిపోయానన్న ప్రకటన చేసేందుకు డాక్టర్లు అప్పుడు రెడీ అయ్యారన్నారు. తన మరణాన్ని స్టాలిన్-టైపు సినారియోతో ఎదుర్కోవటానికి డాక్లర్ల దగ్గర ఒక వ్యూహం రెడీగా ఉండిందన్నారు. తాను తిరిగి కోలుకోవడానికి లీటర్ల లీటర్ల ఆక్సిజన్ అవసరమైందన్నారు. అదొక కఠినమైన ఓల్డ్ మూమెంట్, దాన్ని తిరస్కరించలేనన్నారు. అద్భుతమై వైద్య సేవల కారణంగా తాను ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు బోరిస్ తెలిపారు. ఇది ఎలా జరిగిందో మాటల్లో చెప్పడం కష్టమన్నారు. కష్టసమయంలో తనను తిరిగి మూములు మనిషిని చేసిన మెడికల్ స్టాఫ్ కు బోరిస్ థ్యాంక్స్ చెప్పారు. ఇంటర్వ్యూ సమయంలో అనేకసార్లు బోరిస్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన గొంతు తడబడినట్లు సమాచారం.

హాస్పిటల్ లో ఉన్న సమయంలో తన ఆలోచన ప్రక్రియను బోరిస్ వివరిస్తూ…నాకు గుర్తున్నదంతా నిరాశ మాత్రమే. సూచికలు తప్పు దిశలో కొనసాగుతున్నందున నేను చాలా నిరాశకు గురయ్యాను. ఈ వైరస్ కు మెడిసిన్ లేదు, ఎటువంటి క్యూర్ లేదు అని అనుకున్నాను. ‘నేను దీని నుండి ఎలా బయటపడగలను?అనే దశలో నా ఆలోచనలు ఉన్నాయి అని బోరిస్ జాన్సన్ తెలిపారు.

బోరిన్ ను ఇంటర్వ్యూ చేసిన డేవిడ్ ఊడింగ్ తెలిపిన ప్రకారం… గతంలో బోరిజ్ జాన్సన్‌ను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశానన్న జాన్సన్, కరోనా వైరస్ తో యుకె ప్రధాని చేసిన పోరాటం అతన్ని మారిన వ్యక్తిని మిగిల్చిందన్నారు. సంవత్సరాలుగా, నేను బోరిస్ జాన్సన్‌ను చాలాసార్లు కలుసుకున్నాను, ఇంటర్వ్యూ చేసాను. కాని ఈ సమావేశం గతంలో లాంటిది కాదు. సోషల్ డిస్టెన్స్ కోసం మేము చాలా దూరంగా కూర్చోవలసి వచ్చింది,బోరిస్ ను మారిన వ్యక్తిగా కరోనా వైరస్ వదిలివేసిందని స్పష్టంగా తెలుస్తుందని ఊడింగ్ చెప్పారు. 

మరోవైపు,బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(55) బుధవారం(ఏప్రిల్-29,2020)తండ్రి అయిన విషయం తెలిసిందే. తండ్రి కావడానికి కొన్ని వారాల ముందే ఆయన కరోనా వైరస్ బారినపడి మృత్యువు అంచులు దాకా వెళ్లి ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్నారు. దీంతో తన ప్రాణాలు కాపాడిన డాక్లర్ల పేరును తన కొడుకుకి పెట్టి వారి రుణం తీర్చుకున్నారు. ఈ విషయాన్నిశనివారం  ప్రధాని ఫియాన్సీ.. కారీ సీమండ్స్(32) ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా తెలిపారు.

కరోనాకు చికిత్స చేసిన డాక్టర్లతోపాటు, తమ పూర్వీకులు పేర్లు కలిసి వచ్చేలా విల్‌ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని తమ కొడుకుకి పేరు పెట్టినట్లు తెలిపారు. సీమండ్స్ తాత లౌరీ.. బోరిస్ తాత విల్‌ఫ్రెడ్.. జాన్సన్‌కు వైద్యం చేసి డాక్టర్లు నిక్ ప్రైస్, నిక్ హర్ట్.. ఇలా నలుగురి పేర్లు కలిసొచ్చేలా కుమారుడికి పెట్టినట్టు వివరించారు. 

మర్చి చివరివారంలో బ్రిటన్ ప్రధానికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా మొదట్లో ఆయన ఇంటి దగ్గరే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఏప్రిల్ 7న హాస్పిటల్‌కు తరలించారు. వైరస్ తీవ్రత పెరగడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. వారం రోజుల తర్వాత ఆయన కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో బ్రిటన్ ప్రధాని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సెయింట్ థామస్ హాస్పిటల్ లో తనకు వైద్య సేవలు అందించిన నేషనల్‌ హెల్త్ స్టాఫ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయ‌న అన్నారు. వారి సేవ‌ల‌కు కేవ‌లం థ్యాంక్స్ మాత్రమే స‌రిపోద‌ని, హాస్పిటల్ సిబ్బందే త‌న ప్రాణాల‌ను కాపాడార‌ని అన్నారు. అన్నట్టుగా థ్యాంక్స్‌తోనే ఆగిపోకుండా తన బిడ్డకు వైద్యుల పేరునే పెట్టి రుణం తీర్చుకున్నారు.