కుక్కకు వీల్ చైర్ : దురదృష్టంలో అదృష్టం

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 10:29 AM IST
కుక్కకు వీల్ చైర్ : దురదృష్టంలో అదృష్టం

ఒహియో : ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న మనుషులు  వీల్ చైర్ సహాయంతో గానీ..ఆర్టిఫిషియల్ లెగ్స్ తో గానీ  జీవితాలను కొనసాగిస్తుంటారు. కానీ ఓ కుక్కకు దురదృష్టంలో అదృష్టం వరించింది. ప్రమాదానికి గురై రెండు కాళ్లు పోగొట్టుకున్న కుక్క వీల్ చైర్ తో చక్కగా నడుస్తోంది. మానవత్వం ఇంకా చచ్చిపోలేదని నిరూపించిన ఈ ఘటన..అమెరికాలోని ఒహియోలో జరిగింది. 
 

ఒహియోలోని హ్యామిల్‌టన్ ప్రాంతానికి చెందిన ట్రూపర్(కుక్క పేరు) రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయింది. అంతేకాదు ఐ   ప్రమాదంలో ఒక కన్ను,  తోక, కూడా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో  బతకదులే ట్రూపర్ బతికింది. కానీ దానికి వైద్యం చేసేందుకు కుక్కేకదా అనే భావంతో ఎవరు ముందుకు రాలేదు. కానీ యానిమల్ ఫ్రెండ్స్ హ్యూమన్ సొసైటీ అనే సంస్థ కుక్కను కాపాడింది. పశువైద్యులతో చికిత్సనందించింది. అంతేకాదు వీల్ చైర్‌ను తయారుచేయించారు. 

ప్రస్తుతం ట్రూపర్ ఆరోగ్యం కుదుటపడింది. వీల్‌చైర్ తో చక్కగా నడుస్తోంది. ట్రూపర్‌ను దత్తత తీసుకునే వారి కోసం వెతుకుతోంది ఈ సంస్థ. దరఖాస్తులను సైతం ఆహ్వానిస్తు..ప్రకటనలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ట్రూపర్‌ కోసం వచ్చినవారికి దాన్ని దత్తతకు ఇవ్వనున్నారు.