Dog Guinness : వావ్.. మెరుపు వేగంతో పగలగొట్టి గిన్నిస్‌కి ఎక్కిన కుక్క

సోషల్ మీడియాలో ఓ బుజ్జి కుక్క వీడియో తెగ వైరల్ గా మారింది. అంతా ఆ కుక్క ప్రతిభను చూసి విస్తుపోతున్నారు. ఇది మామూలు కుక్క కాదురో అంటున్నారు. ఇంతకీ ఆ శునకం ఏం చేసిందో తెలుసా...

Dog Guinness : వావ్.. మెరుపు వేగంతో పగలగొట్టి గిన్నిస్‌కి ఎక్కిన కుక్క

Dog Guinness

Dog Guinness : సోషల్ మీడియాలో ఓ బుజ్జి కుక్క వీడియో తెగ వైరల్ గా మారింది. అంతా ఆ కుక్క ప్రతిభను చూసి విస్తుపోతున్నారు. ఇది మామూలు కుక్క కాదురో అంటున్నారు. ఇంతకీ ఆ శునకం ఏం చేసిందో తెలుసా… మెరుపు వేగంతో సెకన్ల వ్యవధిలోనే బెలూన్లు(బుడగలు) పగలగొట్టింది.

ఈ బుజ్జి కుక్క ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో బెలూన్లను పగులగొట్టింది. దీని పేరు ట్వింకి. బెలూన్లను అత్యంత వేగంగా పగలగొట్టి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 39.08 సెకన్లలో 100 బెలూన్లను పగులగొట్టింది. ట్వింకి జాక్ రస్సెల్ ఓ టెర్రియర్ జాతి కుక్క. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో రికార్డును సొంతం చేసుకుంది. మెరుపు వేగంతో బెలూన్లు పగిలిపోతున్న తీరు అందరిని ఆకట్టుకుంది.

ఇందులో విశేషం ఏంటంటే ఈ వీడియో ఇప్పటిదికాదు. చాలా పాతది. 2014లోది. అయితే అనూహ్యంగా ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనాలు ఈ బుజ్జి కుక్క టాలెంట్ చూసి ఫిదా అవుతున్నారు. ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేకాదు వీడియోని షేర్ చేసి వైరల్ చేసేశారు. ఒక లక్ష 15వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇంకా వీవ్స్, లైక్స్ వస్తూనే ఉన్నాయి. కాగా ట్వింకి అన్నా ముందు బ్రిటన్ కి చెందిన వండర్ డాగ్ క్యాలీ పేరు మీద ఈ రికార్డు ఉండేది. ఆ కుక్క 41.67 సెకన్లలో 100 బెలూన్లు పగలగొట్టింది. క్యాలీ రికార్డును ట్వింకి బ్రేక్ చేసింది. ఆ తర్వాత కెనడాకి చెందిన విప్పెట్ బ్రీడ్ కుక్క ట్వింకి రికార్డును బ్రేక్ చేసింది. ఆ శునకం కేవలం 28.22 సెకన్లలో 100 బెలూన్లు పగలగొట్టింది. ప్రస్తుతం గిన్నిస్ రికార్డు దీని పేరు మీదే ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Guinness World Records (@guinnessworldrecords)