వైరల్‌గా మారిన కుక్క కనుబొమ్మలు

నిజానికీ ఈ కుక్క స్పెషల్ బ్రీడ్ కూడా కాదు. రష్యాకు చెందిన బ్రాస్క్ వీధుల్లో ఉండే వీధి కుక్క ఇది. వీధుల్లో తిరిగే కుక్కను కాపాడిన వారు కనుబొమ్మల స్థానంలో దట్టంగా వెంట్రుకలు ఉండటంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

వైరల్‌గా మారిన కుక్క కనుబొమ్మలు

నిజానికీ ఈ కుక్క స్పెషల్ బ్రీడ్ కూడా కాదు. రష్యాకు చెందిన బ్రాస్క్ వీధుల్లో ఉండే వీధి కుక్క ఇది. వీధుల్లో తిరిగే కుక్కను కాపాడిన వారు కనుబొమ్మల స్థానంలో దట్టంగా వెంట్రుకలు ఉండటంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

నెటిజన్లకు కాస్త కొత్తగా అనిపిస్తే చాలు. క్షణాల్లో షేర్‌లు చేస్తూ వైరల్‌గా మార్చేస్తుంటారు. అదెలాంటి విషయమైనా సరే. ఈ క్రమంలోనే ఇటీవల ఓ కుక్క సహజంగానే కనుబొమ్మలు కలిగి ఉన్న ఫొటో వైరల్ గా మారింది. పెంపుడు జంతువులపై ప్రేమ ఉన్న మేకప్, అలంకరణ కోసం తహతహలాడేవారు ఇది చూసి మెచ్చేసుకుంటున్నారు. ఆ కుక్కకు కనుబొమ్మలు సహజంగానే ఉన్నప్పటికీ కృత్రిమమైనవి అలంకరించేందుకు సిద్ధమైపోతున్నారు. 

నిజానికీ ఈ కుక్క స్పెషల్ బ్రీడ్ కూడా కాదు. రష్యాకు చెందిన బ్రాస్క్ వీధుల్లో ఉండే వీధి కుక్క ఇది. వీధుల్లో తిరిగే కుక్కను కాపాడిన వారు కనుబొమ్మల స్థానంలో దట్టంగా వెంట్రుకలు ఉండటంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటో చూసి ఒక్సానా అనే మహిళ ఆ కుక్కను ఎక్కువ ఖరీదుకు కొనుక్కొని వెళ్లింది. 

ఆ తర్వాత కుక్కకు ఫ్రిడా అనే ఫ్యామస్ పెయింటర్ పేరు పెట్టింది. ‘ఇలాంటి కూలెస్ట్ కుక్క దొరికినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. దీనికి ఇప్పటికే రెండు కమాండ్లు తెలుసు. సిట్, కమ్ హియర్ అంటే చాలు వెంటనే అర్థమైపోతాయి. దాని కోసం బొమ్మలు కూడా కొనుక్కొచ్చాను. తనకో మంచం ఏర్పాటు చేసి చూసుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది.