మనుష్యులేనా?:కుక్క మెడకు బండరాయి కట్టి నదిలో పడేశారు..అయినా బతికింది

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 04:43 AM IST
మనుష్యులేనా?:కుక్క మెడకు బండరాయి కట్టి నదిలో పడేశారు..అయినా బతికింది

ఓ కుక్కను చంపాలని ఆ కుక్క మెడకు పెద్ద బండరాయి కట్టి నదిలో పడేశారు. కానీ ఓ మహిళ ఆకుక్కను గుర్తించటంతో బతికి బైటపడింది. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో నెవార్క్‌లో చోటు చేసుకుంది. నదిలో పడి ఉన్న బెల్జియం షెఫాయీ జాతికి చెందిన డాగ్ ‌న ఒక మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టిమరీ కాపాడింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసింది. 

కాలికి బండరాయి కట్టి, దానిని చంపుదామనే ఉద్దేశంతో నదిలో పడేశారని పోలీసులు తెలిపారు. ఆ బండరాయి బరువు 60 కిలోల వరకూ ఉందనీ తెలిపారు. నాటింగమ్‌షైర్‌కు చెందిన జెన్ హార్పర్ అనే మహిళ తన ఫ్రెండ్ తో కలిసి నది తీరానాకి షికారుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఫ్రెండ్ కు నీటిలో నుంచి ఏవో సౌండ్స్ వినిపించాయి. ఎవరో నీటిలో మునిగిపోయి, బయటపడేందుకు ప్రయత్నిస్తున్నశబ్ధం వినిపించింది. దీంతో జెన్ అక్కడకు వెళ్లిచూడగా ఒక కుక్క కనిపించింది.

వెంటనే మరేం ఆలోచించకుండా నదిలోకి దూకి, దానిని రక్షించటానికి దాన్ని పట్టుకుని ఒడ్డుకు తీసుకురావటానికి యత్నించింది. కానీ చాలా బరువుగా ఉంది. ఇదేంటి ఓ కుక్క ఇంత బరువుగా ఎలా ఉంటుందని డౌట్ వచ్చి నీటి లోపలికి చూడగా..కుక్క కాలికి పెద్ద బండరాయి కట్టివుండటాన్ని చూసింది. ఆ కుక్కను నదిలో అతి కష్టంమ్మీద బయటకు తీసుకురాగలిగింది. దాని కాలికి ఉన్న బండరాయిని విప్పి..చావు బతుకుల్లో కొట్టుకుంటున్నా కుక్కును చికిత్స కోసం వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అనంతరం పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసింది. 

నాటింగమ్‌షైర్ పోలీసు అధికారి పీసీ ఆడం పెస్ మాట్లాడుతూ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఓ మహిళ ఎంతో ధైర్యంతో కుక్కను రక్షించిందని అన్నారు. ఆ కుక్క పేరు 2010లో బెలా అనే పేరుగా నమోదై ఉందని..బెలా ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కుక్కను నదిలో ఎవరు పడేశారు? ఎందుకు పడేశారు? అని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బెలా గురించి గానీ, ఈ ఘటన గురించి గానీ ఎవరికైనా తెలిస్తే పోలీసులకు కాల్ చేసిన చెప్పాలని సూచించారు.