ద్యావుడా ..ట్రిపుల్ రైడింగ్ చేసిన కుక్క 

  • Published By: veegamteam ,Published On : October 28, 2019 / 08:10 AM IST
ద్యావుడా ..ట్రిపుల్ రైడింగ్ చేసిన కుక్క 

పెంపుడు జంతువుల్లో కుక్కది ప్రత్యేక స్థానం. కుక్కల్ని పెంచుకునే వారు ఎక్కడి వెళ్లినా వారి వెంటే కార్లలో,బైక్ లపై  డాగ్స్ ను కూడా తీస్కెళ్తుంటారు. అయితే ఓ కుక్క మాత్రం తానే బైక్ డ్రైవింగ్ చేస్తూ తన యజమానులను తీస్కెళ్తూ ట్రిఫుల్ రైడింగ్ చేసింది. ఇద్దరు వ్యక్తులను వెనుక కూర్చోబెట్టుకుని బైక్ రయ్యిమంటూ దూస్కెళ్లింది. వెనక కూర్చున్న వ్యక్తులు హెల్మెట్ పెట్టుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్న కుక్క మాత్రం హెల్మెట్ పెట్టుకోలేదు. ఎందుకంటే కుక్కల కోసం హెల్మెట్ తయారు కాలేదు కాబట్టి. 

మనుషులే కాదు మేము నడపగలం బైకుల్ని అంటూన్న ఈ కుక్క. ఔరా..!! అనిపిస్తోంది. బ్రెజిల్ లో ట్రిబుల్ రైండింగ్ చేసిన ఈ శునకం వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
బ్రెజిల్లోని ఓ నేషనల్ హైవేపై గాలి వేగంగా వీస్తున్నా..ఈ శునరాజం మాత్రం  ఏ మాత్రం తడబడకుండా ట్రిపుల్ రైడింగ్ చేసి ఆశ్చర్యం కలిగిస్తోంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.కుక్కగారి డ్రైవింగ్ కు ఫిదా అయిపోతున్నారు.