వింత కుక్క :  ‘తలలో మరో నోరు’ 

  • Published By: veegamteam ,Published On : April 8, 2019 / 09:10 AM IST
వింత కుక్క :  ‘తలలో మరో నోరు’ 

మనుషులకైనా..జంతువులకైనా నోరు ఒక్కటే ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల వింత వింత జననాలు జరగుతుంటాయి. ఇటువంటిదే టాడ్ అనే ఈ కుక్క రెండు నోరులతో పుట్టింది.  సాధారణంగా ఉండే ‘తలలో మరో నోరు’తో జన్మించింది. చెవి ఉండాల్సిన చోట దానికి మరో నోరు ఉంది. అంతేకాదు ఆనోట్లో రెండు పళ్లు కూడా ఉన్నాయి. అమెరికాలోని ఒక్లహోమా నగర వీధుల్లో తిరుగుతున్న ఈ కుక్కను ముట్ మిస్ఫిట్స్ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆలనాపాలన చూస్తున్నారు. 
Read Also : ఐడియా అదుర్స్ : ట్యాక్సీపై IPL లైవ్ స్కోరు

వాసన పసికట్టటంలో కుక్కలకు కుక్కలే సాటి అనే విషయం తెలిసిందే. కానీ టాడ్ కు వాసన కూడా తెలియదు. అంతేకాదు దానికి సౌండ్ కూడా సరిగా వినిపించదు. టాడ్ కు తలలోని అవయవాల అమరికలో ఉన్న లోపాల వల్లనేని పశు వైద్యులు తెలిపారు. 

టాడ్ ను కంటికి రెప్పలా కాపాడుతున్న దాని బాగోగులు చూసుకుంటున్న ముట్ మిస్ఫిట్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు హీదర్ మాట్లాడుతూ..టాడ్‌ను మొదటిసారి చూసినప్పుడు  మూడు చెవులు ఉన్నాయేమో అనుకున్నామనీ..పరిశీలించి చూడగా..మరో నోరు నోట్లో రెండు దంతాలు కనిపించాయని చెప్పారు.ఆ రెండింటిలో ఒక పన్ను విరిగిపోయిందని కూడా తెలిపారు. విరిగిపోయిన పన్నును తీసివేసిన తరువాత టాడ్ చాలా  రిలీఫ్‌గా ఫీలైందని హీదర్ తెలిపారు. 
Read Also : పొల్లాచిలో వరుస హత్యలు.. కాలేజీ అమ్మాయిలే టార్గెట్