Covid-19: కొవిడ్ వస్తే కుక్కలే పసిగడతాయ్!! స్కూల్లో స్పెషల్ అరేంజ్మెంట్

కుక్కలు మనుషులకు మంచి స్నేహితులు. మనతో పాటు ఏ పనైనా చేసేందుకు ప్రయత్నిస్తాయి. కొన్ని సార్లు మనకు సాధ్యపడని పనులు కూడా చేసిపెడతాయి.

Covid-19: కొవిడ్ వస్తే కుక్కలే పసిగడతాయ్!! స్కూల్లో స్పెషల్ అరేంజ్మెంట్

Dogs

Covid-19: కుక్కలు మనుషులకు మంచి స్నేహితులు. మనతో పాటు ఏ పనైనా చేసేందుకు ప్రయత్నిస్తాయి. కొన్ని సార్లు మనకు సాధ్యపడని పనులు కూడా చేసిపెడతాయి. అటువంటి వాటికి ఉదాహరణే ఈ కొవిడ్ డిటెక్షన్. అమెరికాలోని ఓ స్కూల్లో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని కుక్కలే పసిగడుతున్నాయట.

స్టాఫ్, స్టూడెంట్ ఎవరికైనా సరే కొవిడ్ పాజిటివ్ వస్తే వారిని ఐడెంటిఫై చేస్తున్నాయని ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏజెన్సీ ఆఫీసర్ చెప్తున్నారు. బ్రిస్టల్ కౌంటీ షెరిఫ్ స్కూల్లో ఈ స్పెషల్ అరేంజ్మెంట్ చేశారు. 14నెలల లాబ్రోబర్స్ క్యాంపస్ మొత్తం తిరుగుతూ ఉంటాయని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు.

K9s హుంటా, డ్యూక్ నార్టన్ మిడిల్ స్కూల్ కు కొవిడ్ డిటెక్షన్ పూర్తి చేస్తాయి. నార్కోటిక్స్ డాగ్స్ కు మాదిరిగానే వీటికి ట్రైనింగ్ ఇచ్చారు. కొవిడ్ పేషెంట్ వాడిన మాస్క్ ను కూడా గుర్తిస్తాయట. ఆ మాస్క్ ను ముక్కలుగా చేసి ప్లాస్టిక్ సంచిలో వేసి నాశనం చేయడం సిబ్బంది బాధ్యత.

ఇది కూడా చదవండి : ‘మహానటి’కి కరోనా

కొవిడ్ వచ్చిన వారి మెటాబాలిజంలో మార్పులు వచ్చి వాసన మారుతుందట. అలా కుక్కలు పసిగట్టగలుగుతున్నాయట. ఈ కుక్కల వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నామని స్కూల్ యాజమాన్యం చెబుతుంది.