చారిత్రక ఓటింగ్…అభిసంశన ఆరోపణల్లో నిర్దోషిగా బయటపడిన ట్రంప్

అన్ని అభిసంశన ఆరోపణలు నుంచి చారిత్రాత్మకమైన ఓటింగ్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కాంగ్రెస్‌ను అడ్డుకోవడం వంటి రెండు అభిశంసన ఆరోపణలపై సెనేట్‌లో ఓటింగ్ జరుగగా ట్రంప్ నిర్దోషిగా పేర్కొంటూ సభ్యులు ఓటు వేశారు.

చారిత్రక ఓటింగ్…అభిసంశన ఆరోపణల్లో నిర్దోషిగా బయటపడిన ట్రంప్

Donald Trump

అన్ని అభిసంశన ఆరోపణలు నుంచి చారిత్రాత్మకమైన ఓటింగ్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కాంగ్రెస్‌ను అడ్డుకోవడం వంటి రెండు అభిశంసన ఆరోపణలపై సెనేట్‌లో ఓటింగ్ జరుగగా ట్రంప్ నిర్దోషిగా పేర్కొంటూ సభ్యులు ఓటు వేశారు. రిపబ్లికన్-మెజారిటీ సెనేట్….ట్రంప్ అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఆయనను నిర్దోషిగా ప్రకటించడానికి 52మంది ట్రంప్ కు అనుకూలంగా ఓటు వేయగా 48మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ట్రంప్  కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్)కు ఆటంకం కలిగించిన దానిపై 53మంది ట్రంప్ నిర్దోషిగా సేర్కొంటూ ఓటు వేయగా,47మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మెజార్టీ సభ్యులు ట్రంప్ ను నిర్దోషిగా పేర్కొంటూ ఓటు వేశారు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ట్రంప్ తన ప్రత్యర్థిని ఇరుకునపెట్టేందుకు ఉక్రెయిన్ నుండి అక్రమంగా సహాయం కోరినందుకు ఆయనను పదవి నుండి బహిష్కరించేందు విపక్షం చేసిన ప్రయత్నాన్ని వెంటనే ట్రంప్ ఓడించారు. 78 రోజుల తీవ్రమైన దర్యాప్తు అనంతరం ట్రంప్ నిర్దోషిగా బయటకు రావడంతో డెమొక్రాట్లు నిరాశకు గురయ్యారు.

దోషిగా తేల్చేందుకు అవసరమైన మూడింట రెండు వంతుల సూపర్ మెజారిటీ కంటే చాలా తక్కువగా ఓట్లు రావడంతో ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డాడు. మూడింట రెండొంతుల మంది సెనేటర్లు అతన్ని దోషిగా ప్రకటించలేదని, అభియోగాలు మోపబడినట్లు ట్రంప్ దోషి కాదని విచారణకు అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ అన్నారు. దీంతో ఈ ఏడాది నవంబర్‌లో తిరిగి ఎన్నిక కావాలన్న తన ప్రచారంలో ట్రంప్ పూర్తిగా మునిగిపోవడానికి ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయింది. అయితే తనపై విచారణను ఓ మంత్రవేట,లేనివి సృష్టించిన గాలివార్తగా ట్రంప్ అభివర్ణిచిన విషయం తెలిసిందే. అయితే సాక్ష్యం మరియు డాక్యుమెంట్స్ కోసం కాంగ్రెషనల్ నోటీసులు పాటించటానికి నిరాకరిస్తూ, ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చే అధ్యక్షుడిగా తనకు హక్కు ఉందని ట్రంప్ వాదించారు.

ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ మరోసారి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ట్రంప్ పై డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్ పోటీలో నిల‌వ‌నున్నారు. ఈ సమయంలో జోసెఫ్ బైడెన్‌ను దెబ్బ‌తీసేందుకు ఉక్రెయిన్ దేశాధ్య‌క్షుడు జెలెన్‌స్కీని ఓ ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ బెదిరించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చిన విసయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఉన్న ఓ సంస్థ‌లో బైడెన్ కుమారుడు హంట‌ర్ బైడ‌న్‌ పై అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వాటిపై విచార‌ణ చేపట్టాల‌ని ఉక్రెయిన్ దేశాధ్య‌క్షుడిని ట్రంప్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 250 మిలియన్ డాలర్ల సైనిక సాయం గురించి కూడా ట్రంప్ బెదిరించారని ఆరోపణలు వచ్చాయి.

అయితే ఇప్పటివరకూ ఏ అమెరికా అధ్యక్షుడినీ అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికా చ‌రిత్ర‌లో ఇద్ద‌రు దేశాధ్య‌క్షుల‌ను అభిశంసించారు. 1868లో ఆండ్రూ జాన్స్‌, 1998లో బిల్ క్లింట‌న్‌ను అభిశంసించారు. కానీ ఆ ఇద్ద‌రూ సేనేట్ విచార‌ణ నుంచి త‌ప్పించుకున్నారు. ఇక 1973లో రిచ‌ర్డ్ నిక్స‌న్ మాత్రం అభిశంస‌న అభియోగం రాగానే ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.