Apple CEOపై US అధ్యక్షుడు ఫైర్ : ట్రంఫ్ ఐఫోన్‌లో Home Button మాయం

  • Published By: vamsi ,Published On : October 26, 2019 / 08:09 AM IST
Apple CEOపై US అధ్యక్షుడు ఫైర్ : ట్రంఫ్ ఐఫోన్‌లో Home Button మాయం

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. తన ఐఫోన్ లో హోం బటన్ తొలగించడంపై ట్రంప్ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఐఫోన్ టెక్నాలజీపై శుక్రవారం (అక్టోబర్ 25, 2019) ట్విట్టర్ లో టిమ్ కుక్ ను ట్రంప్ ఏకిపారేశారు. ఆపిల్ కంపెనీ 2017లో ప్రవేశపెట్టిన కొత్త మోడల్ ఐఫోన్లలో హోం బటన్ తొలగించింది. దీంతో హోం స్క్రీన్ కు రావాలంటే ప్రతిసారి స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో యూజర్లకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. ఐఫోన్ అదే మోడల్ వాడుతున్న ట్రంప్ ఐఫోన్లో కూడా హోం బటన్ ఒక్కసారిగా మాయమైంది. దీంతో ఆగ్రహించిన ట్రంప్ తనదైన శైలిలో ఆపిల్ సీఈఓను ఉతికి ఆరేశారు. 

‘టిమ్.. ఐఫోన్లో హోం బటన్.. స్వైప్ కంటే బాగుంది. ఐఫోన్లలో భారీ స్ర్కీన్లు ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది. లేదంటే మీ బిజినెస్ కోల్పోమే ప్రమాదం ఉంది. శాంసంగ్ మీ నిశబ్ద వైఖరిని ఎంత మాత్రం నమ్మదు అని ట్రంప్ వరుస ట్వీట్లు చేశారు. ‘అతిపెద్ద స్ర్కీన్ ఐఫోన్లను ఆపిల్ తీసుకువస్తుందని నాకు నమ్మకం లేదు. 

శాంసంగ్ వారి వ్యాపారాన్ని తనవైపు లాగేసుకుంటోంది. స్టీవ్ జాబ్స్ సమాధిలో ధైర్యంగా తిరుగుతుంటారు కాబోలు అని వ్యంగంగా ట్రంప్ ట్వీట్ చేశారు. ఒక పెద్ద స్ర్కీన్ ఐఫోన్ డిజైన్ చేసి ఇవ్వడంలో ఆపిల్ నాతో అసంతృప్తిగా ఉందేమోనని ఆశ్చర్యంగా ఉంది. ఆ పని త్వరలో చేస్తారని ఆశిస్తున్నాను. ఎంతకాలం పడుతుందో చూడాలి అని ట్వీట్ చేశారు.