Donald Trump: మస్క్ ట్విట్టర్ కొనుగోలును ప్రశంసించిన ట్రంప్.. తన ఖాతా పునరుద్ధరణపై ఏమన్నారంటే?

అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం విధ్వేషాలు రెచ్చగొట్టారంటూ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిషేధించారు. అయితే నిషేధం ఎత్తివేతపై అప్పటి సీఈవో జాక్ డోర్సే స్పందిస్తూ.. ఒక సారి తీసుకున్న నిర్ణయంలో ఇక మార్పులు ఉండవని అన్నారు. అయితే ట్విట్టర్ డీల్ నడుస్తున్న సమయంలో ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్దరణపై మస్క్ ప్రశ్నించారు. ఉగ్రవాదులకు సైతం ఖాతాలు ఉన్నప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడి ఖాతాను తొలగించడం ఏంటని ప్రశ్నించారు

Donald Trump: మస్క్ ట్విట్టర్ కొనుగోలును ప్రశంసించిన ట్రంప్.. తన ఖాతా పునరుద్ధరణపై ఏమన్నారంటే?

Donald Trump responds to commit to rejoining the twitter

Donald Trump: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‭ను కొనుగోలు చేయడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ట్విట్టర్‭లో అతివాద వామపక్షాలు చెలరేగవని ఆయన అన్నారు. అయితే తన ట్విట్టర్ ఖాతా పునరుద్దరణపై ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా విషయాన్ని దాటవేశారు.

ఎన్నో మలుపులు, ఎన్నో ట్విస్ట్‭ల అనంతరం.. ఎట్టకేలకు 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‭ను మస్క్ సొంతం చేసుకున్నారు. గురువారం అధికారికంగా ట్విట్టర్ కార్యాయలంలో మస్క్ అడుగుపెట్టారు. అలా అడుగు పెట్టారో లేదో, ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, ట్విట‌ర్ పాల‌సీ హ‌డ్ విజ‌యా గ‌ద్దె సహా ఇతర ఉద్యోగుల్ని తొలగించారు. కాగా, ఈ కొనుగోలు విషయమై ట్రంప్ మాట్లాడుతూ ‘‘ట్విట్టర్ మస్క్ చేతిలోకి రావడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. క ట్విట్టర్‭లో అతివాద వామపక్షాలు చెలరేగవు. ఇది మన దేశానికి చాలా ప్రమాదకరం’’ అని అన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం విధ్వేషాలు రెచ్చగొట్టారంటూ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిషేధించారు. అయితే నిషేధం ఎత్తివేతపై అప్పటి సీఈవో జాక్ డోర్సే స్పందిస్తూ.. ఒక సారి తీసుకున్న నిర్ణయంలో ఇక మార్పులు ఉండవని అన్నారు. అయితే ట్విట్టర్ డీల్ నడుస్తున్న సమయంలో ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్దరణపై మస్క్ ప్రశ్నించారు. ఉగ్రవాదులకు సైతం ఖాతాలు ఉన్నప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడి ఖాతాను తొలగించడం ఏంటని ప్రశ్నించారు. అయితే తాజాగా ట్విట్టర్ మస్క్ సొంతం కావడంతో ట్రంప్ ఖాతా పునరుద్దరించొచ్చనే అనుమానాలు తాజాగా వ్యక్తం అవుతున్నాయి.

US Crime : అమెరికాలో ఘోర సంఘటన .. ఓ ఇంట్లో ఆరుగురు చిన్నారులతో సహా ఎనిమిది మృతదేహాలు .. హత్యలా? ఆత్మహత్యలా?!