Home » International » ఫేస్ మాస్క్ ధరించాలనే ఆదేశాలివ్వను..ట్రంప్
Updated On - 6:21 pm, Sun, 19 July 20
ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనాను నియంత్రించగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నఅంశాన్నికొట్టిపడేస్తున్నారు.
కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రపంచ దేశాధినేతలు ప్రజలకు మాస్క్‌లు ధరించాలని పిలుపునిస్తే, ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా మాస్క్‌లు ధరించమని ప్రజలను ఆదేశించలేనని, ప్రజల స్వేచ్ఛకు ఆ నిర్ణయాన్ని వదిలేయాలని తాను కోరుకుంటానని అన్నారు.
ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ….దేశంలోని నేతలందరూ ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని, ఫేస్మాస్క ధరించేలా కఠిన ఆంక్షలు తీసుకురావాలన్నారు. అప్పుడే కరోనాను నియంత్రించగలమని చెప్పారు అమెరికన్లు ఫేస్‌మాస్క్ ధరించక పోవడం వల్లే దేశం పూర్తిస్థాయిలో తెరుచుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే.. ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్న అవగాహన అంత ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
.
ఆంథోనీ ఫౌసీ వ్యాఖ్యలపై తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ట్రంప్ స్పందిస్తూ….ప్రజలందరు మాస్క్‌లు ధరించాలనే నిబంధనను తాను వ్యతిరేకిస్తానని, మాస్క్‌లు వేసుకున్నంత మాత్రాన పూర్తిగా వైరస్‌ను నియంత్రించలేమని అభిపప్రాయపడ్డారు. అమెరికన్లు ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా ధరించాలనే ఆదేశాలు తాను ఇవ్వబోనని ట్రంప్ స్పష్టం చేశారు. ఫేస్‌మాస్క్ ధరించడం మంచిదే అని అయితే ప్రజలకు స్వేచ్చనివ్వాలని ఆయన అన్నారు. నిపుణులు చెబుతున్నట్లు అవసరమైనప్పుడు మాస్క్ ధరించడం పెద్ద ఇబ్బంది కాదని, కానీ సామాజిక దూరాన్ని పాటించడం కొంత ఇబ్బందేనని తెలిపారు.
కాగా ప్రస్తుతం దేశంలో(అమెరికాలో ) ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో, భారీ జనసమూహాలకు అవకాశం ఉందని, అందువల్ల అవసరమైన చోట మాస్క్‌లు ధరించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు సూచించారు. డాక్టర్ ఫాసీ గతంలో ఫేస్‌మాస్క్ ధరించాల్సిన అవసరం లేదన్నారని.. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఫేస్‌మాస్క్ ధరించడం వల్ల అనేక సమస్యలు వస్తాయని ట్రంప్ చెబుతున్నారు.
మరోవైపు, ఎప్పుడు మాస్క్ ధరించని ట్రంప్, ఇటీవల ఒక సారి మాస్క్ ధరించి అందరిని ఆశ్చర్యపరిచారు. మార్చి నెల నుంచి చూసుకుంటే.. ట్రంప్ కేవలం ఒకసారి మాత్రమే మాస్క్‌లో కనిపించారు.
కాగా, అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. నిత్యం 70 వేలకు పైగా కేసులు అమెరికాలో నమదవుతున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు 37 లక్షలకు పైగా కేసులు నమోదవగా.. లక్షా 40 వేలకు పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి.
Lock down Fear : లాక్డౌన్ భయంతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..
Covid-19 – Remdesivir: కొవిడ్ అనేది కామన్ అయిపోయింది.. రెమెడెసివర్ రామ బాణమేం కాదు
జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసు..మాజీ పోలీస్ అధికారిని దోషిగా తేల్చిన కోర్టు
వ్యాక్సిన్ తీసుకున్న 26వేల మందికి కరోనా
పాట్నా ఎయిమ్స్ లో 384మంది వైద్య సిబ్బందికి కరోనా
India’s export of liquid oxygen: కరోనా వేళ..9,234మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను విదేశాలకు అమ్మిన భారత్