యుద్ధం కోరుకోవడం లేదంటూనే అంతుచూస్తామని వార్నింగ్ : అసలు ట్రంప్ టార్గెట్ ఏంటి..?

శాంతి కోరుకుంటున్నాం అంటూనే.. మాతో పెట్టుకుంటే మాత్రం అంతుచూస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గతంలోనూ యుద్ధం మాకు సరదా కాదంటూ కామెంట్

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 02:00 AM IST
యుద్ధం కోరుకోవడం లేదంటూనే అంతుచూస్తామని వార్నింగ్ : అసలు ట్రంప్ టార్గెట్ ఏంటి..?

శాంతి కోరుకుంటున్నాం అంటూనే.. మాతో పెట్టుకుంటే మాత్రం అంతుచూస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గతంలోనూ యుద్ధం మాకు సరదా కాదంటూ కామెంట్

శాంతి కోరుకుంటున్నాం అంటూనే.. మాతో పెట్టుకుంటే మాత్రం అంతుచూస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గతంలోనూ యుద్ధం మాకు సరదా కాదంటూ కామెంట్ చేశాడు. ఇలా కామెంట్ చేసిన రెండు రోజుల్లోనే సులేమానీని హతమార్చాడు. తాజాగా ట్రంప్‌ వల్లిస్తున్న శాంతి మాటల వెనక అర్థమేంటి? నిజంగా శాంతంగా ఉంటాడా? యుద్ధం మొదలుపెడతాడా?

ట్రంప్‌ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ అమెరికా అధ్యక్షుడు తన పక్కన ఉన్న అధికారిని మెచ్చుకున్నాడు అంటే.. ఇక ఆ అధికారి ఉండడనే అర్ధం. వేరే శాఖకు మారిపోవడమే, రిజైన్‌ చేసి వెళ్లిపోవడమో జరుగుతుంది. అలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కూడా. అలాంటి ట్రంప్‌ యుద్ధం కోరుకోవడం లేదంటున్నాడు. అంటే, యుద్ధం జరగబోతోందనేనా అర్థం.

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులతో ధ్వంసం చేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. ఆ దాడుల్లో ఒక్క అమెరికన్‌ కూడా చనిపోలేదని చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల్లో ఇరాన్‌ ముందుందని అన్నారు. ఇరాన్‌ విషయంలో అమెరికా శాంతిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఒకవేళ ఇరాన్‌ ఇంకా దాడులకు పాల్పడితే అమెరికా బలగాలు అందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఒక విధంగా ట్రంప్‌ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేసినట్టే లెక్క. అంటే, ఉగ్రవాదం పేరుతో ఇరాన్‌ను నేలమట్టం చేయడానికి సిద్ధమయ్యాడని అనుకోవాలా?

సులేమానీని ఎప్పుడో హతమార్చాల్సి ఉందని, చాలా దేశాలు ఇరాన్‌ను సహిస్తూ వస్తున్నాయని అన్నారు. జీవితం మీద ఆశ ఉంటే తమపై దాడులు చేయవద్దని ముందే ఉగ్రవాదులకు సందేశం పంపించామన్నారు ట్రంప్. ఉగ్రవాదానికి ఊతమిస్తూ ఇరాన్‌ అందరి ముందు దోషిగా నిలబడిందని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఇరాన్‌ను అణ్వాయుధాలు తయారు చేయనీయమన్నారు. ఇరాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని.. రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలు వాస్తవాల్ని గుర్తించాలని ట్రంప్ సూచించారు. ఇరాన్‌పై త్వరలో మరిన్ని కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధిస్తామన్నారు. శాంతి అంటూ ట్రంప్‌ ఎన్ని మాట్లాడినా.. పరిస్థితులు మాత్రం యుద్ధం తప్పదన్న సంకేతాలు పంపుతోంది.

* అమెరికా యుద్ధాన్ని కాంక్షించడం లేదు- ట్రంప్‌
* పశ్చిమాసియాలో అశాంతిని ప్రోత్సహిస్తే సహించబోము
* ఇరాన్‌ దాడిలో ఏ ఒక్క అమెరికన్‌కు హాని జరగలేదు
* సులేమాని వందలాది అమెరికన్ల మృతికి కారకుడు
* ఉగ్రవాద గ్రూపులకు సులేమాని శిక్షణ ఇచ్చారు
* ఇరాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని సహించేది లేదు

* సులేమానీని ఎప్పుడో చంపాల్సింది
* జీవితం మీద ఆశ ఉంటే దాడులు చేయొద్దు
* ఇరాన్‌ను అణ్వాయుధాలు తయారు చేయనీయం
* రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ వాస్తవాల్ని గుర్తించాలి
* యుద్ధం కోరుకోవట్లేదంటే.. జరగబోతోందనేనా అర్థం?