ఈసారి బైడెన్ చేతిలోఓడిపోతే, 2024ఎన్నికలకు మళ్లీ ట్రంప్ రెడీ

  • Published By: vamsi ,Published On : November 5, 2020 / 06:57 PM IST
ఈసారి బైడెన్ చేతిలోఓడిపోతే, 2024ఎన్నికలకు మళ్లీ ట్రంప్ రెడీ

Trump america elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆలస్యం అవుతున్న కొద్ది మరింత ఉత్కంఠ రేకేత్తుతుంది. ఒకవైపు అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు అవసరమైన మార్జిన్‌(270 ఎలక్టోరల్ ఓట్లు)కు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అతి దగ్గరలో ఉండగా.. మరోవైపు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంకా మేం అధికారంలోకి వస్తాం అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో చివరి వరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో.. ఒకవేళ ట్రంప్ ఓడిపోతే? ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి? అంటే ఇంకా 76 రోజులు ట్రంపే అధ్యక్షుడు. ఈ 76 రోజులు ఆయన వైట్ హౌస్‌లోనే ఉంటారు. ట్రంప్ చేతిలోనే అన్నీ అధికారాలు ఉంటాయి.



వాస్తవానికి మిగతా అధ్యక్షులు ఇంతకుముందు లెక్కల ప్రకారం అయితే ఓడిపోతే వెంటనే దిగిపోయేవారు.. అయితే ట్రంప్ మాత్రం ఓడిపోతే హుందాగా దిగిపోయే రకం కాదు.. రెండో విషయం ఏంటంటే, ట్రంప్‌కు ముందు అధ్యక్షులైన వారు పూర్తిస్థాయి రాజకీయనాయకులు. కానీ, ట్రంప్ ఎక్కువశాతం బిజినెస్ మెన్. ఆ తర్వాతే పొలిటీషియన్. 74ఏళ్ల డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు తాను దిగిపోయాక ఏం అవకాశాలు ఉన్నాయి. ఈ 76రోజులు ఏం చెయ్యొచ్చు.. ఏం చెయ్యాలి అనేదానిపై కచ్చితంగా ఆలోచిస్తారు.. చేస్తారు.



డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఓడిపోతే ఆ తర్వాత సీన్‌‌లో ఆయనను కచ్చితంగా కోర్టు కేసులు వెంటాడే అవకాశం ఉంది. 2016లో ట్రంప్‌కు రష్యా మద్దుతు ఇచ్చిందనే వాదన ఉండగా.. ఇప్పుడు అది ట్రంప్ మెడకు చుట్టుకోవచ్చు. ఓ పోర్న్ స్టార్‌కు ట్రంప్ భారీ ఎత్తున డబ్బులు బదిలీ చేసిన అంశంలో ఇప్పటికే ఆయన కోర్టు కేసులు ఎదుర్కొంటుండగా.. అనధికార లావాదేవీలు, అనుమానాస్పద లావాదేవీలు ఆయనను ఇరికించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఓ రేప్ కేసు, లైంగిక దాడి ఆరోపణలు కేసు కూడా ట్రంప్ మీద నమోదై ఉంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు కాబట్టి, విచారణల నుంచి ఆయనకు పూర్తి రక్షణ ఉంది. ఓడిపోతే మాత్రం ట్రంప్ పరిస్థితి తారుమారు అయిపోతుంది. ఇప్పటికే ట్రంప్ క్యాంపెయిన్ మేనేజర్లు, న్యాయవాదుల్లో 8 మంది తీవ్ర నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తుండగా.. ఇప్పుడు వారితో ట్రంప్ కూడా చేరవచ్చు అని కూడా అంటున్నారు విశ్లేషకులు.



ఇక ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం అయిపోతాడు. ఒక వ్యక్తికి రెండుసార్లు మాత్రమే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు ఓడిపోతే మళ్లీ 2024లో పోటీ చేయవచ్చు. గతంలో 1888లో గ్రోవర్ క్లైవ్ లాండ్ ఇలాగే మొదటి టెర్మ్ తర్వాత ఓడిపోయి మరోసారి 1892లో గెలిచారు. తనను ఓడించిన బెంజ్‌మన్ హారిసన్‌ను మళ్లీ ఓడించారు. అలాగే ట్రంప్‌కు కూడా మళ్లీ 2024లో పోటీ చేసే అవకాశం లభిస్తుంది.



అవన్నీ వద్దు అనుకుని ట్రంప్ ఇటీవల చేసిన ఓ కామెంట్ ప్రకారం చూస్తే మాత్రం.. ‘ఒకవేళ నేను ఓడిపోతే బహుశా దేశం వదిలిపోవాల్సి రావొచ్చు.’ అని అన్నారు. అలా కూడా జరగవచ్చు. ప్రస్తుతం వస్తున్న లెక్కలు ప్రకారం మాత్రం ట్రంప్‌కు గెలిచే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి.