ట్రంప్ లాయర్‌కు కరోనా పాజిటివ్.. కొవిడ్ కాదు చైనా వైరస్ అంటూ ట్రంప్ ప్రచారం

ట్రంప్ లాయర్‌కు కరోనా పాజిటివ్.. కొవిడ్ కాదు చైనా వైరస్ అంటూ ట్రంప్ ప్రచారం

Trump Lawyer: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లాయర్ ర్యూడీ గిలియానీకి కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆదివారం 76సంవత్సరాలి గిలియానీకి పాజిటివ్ వచ్చినట్లు వైట్ హౌజ్ స్పష్టం చేసింది. ట్రంప్‌తో సహా అమెరికన్లలో వైరస్ 2లక్షల 80వేల మందికి కరోనా పాజిటివ్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు.

‘ర్యూడీ గిలియానీ న్యూయార్క్ సిటీ మేయర్ చరిత్రలోనే గ్రేటెస్ట్ వ్యక్తి. చాలా పెద్ద ఎత్తులో కరప్షన్ ను బయటపెట్టారు. ఆ వ్యక్తికి చేసిన టెస్టులో చైనా వైరస్ పాజిటివ్ గా తేలింది’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. కొవిడ్ 19అనే మాటకు బదులు చైనా వైరస్ అని వర్డింగ్ తో పోస్టు పెట్టారు.



గిలియానీ కాస్త లేటుగానే స్పందించారు. గిలియానీని వాషింగ్టన్ లోని జార్జ్ టౌన్ యూనివర్సిటీ హాస్పిటల్ లో చేర్పించారు. దీనిపై హాస్పిటల్ ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రెసిడెంట్ జో బైడెన్ భారీ మెజార్టీతో ఎన్నికవగా ట్రంప్ ఓడిపోయారు.

ఆ ఎన్నికపై ట్రంప్ ఫ్రాడ్ జరిగిందంటూ ప్రచారం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. పైగా అది ప్రూవ్ కూడా చేయలేకపోయారు. గత నెలలో ర్యూడీ గిలియానీ కొడుకు ఆండ్రూకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. అతని కొడుకు స్వయంగా ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు.