వెళ్లి ఓటు వేయండి…పోలింగ్ ముగిసిన వారం తర్వాత ట్రంప్ కొడుకు ట్వీట్

  • Published By: venkaiahnaidu ,Published On : November 11, 2020 / 01:25 PM IST
వెళ్లి ఓటు వేయండి…పోలింగ్ ముగిసిన వారం తర్వాత ట్రంప్ కొడుకు ట్వీట్

ERIC TRUMP:డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. రకరకాల కామెంట్లు,సెటైర్లతో ఎరిక్ ట్రంప్ ని సోషల్ మీడియాలో చెడుగుడాడుకుంటున్నారు నెటిజన్లు. అసలు ఎరిక్ ట్రంప్ పై నెటిజన్ల సెటైర్లకు కారణమేంటీ అనుకుంటున్నారా?



అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి వారం రోజులవుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు..రిపబ్లిక్ పార్టీ నుంచి రెండోసారి అధ్యక్షుడిగా పోటీచేసిన డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయాడు. అయితే,ఇప్పటికీ ట్రంప్ తాను ఓడిపోయినట్లు అంగీకరించడం లేదనుకోండి..అది వేరే విషయం.



అయితే,ఎన్నికలు ముగిసిన వారం తర్వాత మంగళవారం(నవంబర్-10,20210)ఎరిక్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలను ఎరిక్ విజ్ణప్తి చేశారు. మిన్నిసోటాలోని ప్రజలు ఒయటికొచ్చి ఓటు వేయాలని విజ్ణప్తి చేస్తూ ఎరిక్ ట్వీట్ చేశారు.



కాగా, ఎరిక్ ట్రంప్ చేసిన ట్వీట్ కొన్ని నిమిషాల్లోనే డిలీట్ అయిపోయింది. అయితే,మన సోషల్ మీడియాలోకి ఏదైనా సమాచారం ఒకసారి వస్తే..మన నెటిజన్లు దాన్ని గుర్తించకుండా వదిలిపెట్టురుగా. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కుమారుడి నుంచి ఇలాంటి పోస్ట్ వచ్చిందంటే ఇంక ఎలా వదిలిపెడతారు చెప్పండి. కొన్ని గంటల్లోనే ఎరిక్ ట్రంప్ చేసిన ట్వీట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.



ఎలక్షన్ డే ట్వీట్ ని వారం తర్వాతకి ఎరిక్ షెడ్యూల్ పెట్టాడేమో…ఓటర్ ఫ్రాడ్ కి పాల్పడమంటూ మిన్నిపోటాకి ఎరిక్ చెబుతున్నాడేమో…షెడ్యూల్ పోస్ట్..ప్రొఫెసర్ ఎరిక్ ట్రంప్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ అంటూ నెటిజన్లు ట్రంప్ కొడుకుపై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.