టెక్సాస్ మ్యూజియంలో ట్రంప్ మొహంపై పిడిగిద్దులు

టెక్సాస్ మ్యూజియంలో ట్రంప్ మొహంపై పిడిగిద్దులు

Donald Trump

Donald Trump ఎన్నికల్లో ఓడిపోయినా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై కొందరు అమెరికన్లకు ఇంకా కోపం తగ్గలేదు. టెక్సాస్ లోని ఓ మ్యూజియంలోని ట్రంప్ ​మైనపు విగ్రహంపై విజిటర్లు పిడిగుద్దులతో విరుచుకుపడుతున్నారు. లాయిస్​​ టుస్సాడ్స్​ వాక్స్​వర్క్స్​లోని ట్రంప్​ విగ్రహం మొహం భాగంపై ఎక్కువగా పంచ్​ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ట్రంప్​ మైనపు బొమ్మ మొహంపై గాట్లు పడ్డాయి. చేసేదేమీ లేక విజటర్ల దాడి నుంచి విగ్రహాన్ని కాపాడేందుకు వేరే చోటకు తరలించారు నిర్వాహకులు.

Tru

లూయిస్​ టుస్సాడ్స్​ వర్క్స్​ను ‘రిప్లే ఎంటర్​టైన్​మెంట్స్’​ నిర్వహిస్తోంది. అధ్యక్ష విగ్రహాలు ఉండే విభాగంలో తమకు ఎప్పుడూ ఇలాంటి సమస్యలు ఎదురవుతునే ఉన్నాయని ఆ సంస్థ మేనేజర్​ స్టివర్ట్​ తెలిపారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బుష్​, ఒబామాల విగ్రహాలపై కూడా ఇలాంటి దాడులు జరిగినట్లు చెప్పీరు. ఒబమా మైనపు విగ్రహం చెవులు 6సార్లు పోయాయని, జార్జ్​ బుష్​ విగ్రహం ముక్కును విరగ్గొట్టారని వివరించారు. నేతలను రాజకీయంగా విభేదించే వారు ఆగ్రహావేశాలతో ఇలాంటి దాడులకు పాల్పడుతారని చెప్పారు.

రిప్లే ఎంటర్​టైన్​మెంట్స్​ 2016లో మూడు ట్రంప్​ మైనపు విగ్రహాలను తయారు చేసి అమెరికాలోని వివిధ చోట్ల ప్రదర్శనకు ఉంచింది. ఒక్కో విగ్రహం కోసం శిల్ప కళాకారులు 6వారాల పాటు శ్రమించినట్లు ఆ సంస్థ తెలిపింది. రిప్లే ఎంటర్​టైన్​మెంట్స్ ప్రస్తుతం జో బైడెన్ మైనపు విగ్రహాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమైంది.