Trumps Daughter Tiffany Marries : బాయ్‌ఫ్రెండ్‌తో ట్రంప్ కూతురు వివాహం .. దగ్గరుండి జరిపించిన ట్రంప్

బాయ్‌ఫ్రెండ్‌తో ట్రంప్ కూతురు వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది. వీరి వివాహాన్ని ట్రంప్ దగ్గరుండి మరీ జరిపించారు.

Trumps Daughter Tiffany Marries : బాయ్‌ఫ్రెండ్‌తో ట్రంప్ కూతురు వివాహం .. దగ్గరుండి జరిపించిన ట్రంప్

donald trumps daughter tiffany marries

donald trumps daughter tiffany marries  : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రెండో భార్య, నటి మార్లా మాపెల్స్ ఏకైక కుమార్తె టిఫానీ ట్రంప్ తన భాయ్ ఫ్రెండ్ ను వివాహం చేసుకున్నారు. తండ్రి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా దగ్గరుండి మరీ కుమార్తెకు వివాహం జరిపించారు. టిఫానీ ట్రంప్ తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ బౌలస్‌ ను శనివారం (నంబంర్,2022)సౌత్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న తమ ఫ్యామిలీ క్లబ్‌లో వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాలుగేళ్ల ప్రేమాయాణం తరువాత ఇద్దరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

లాంగ్ స్లీవ్ వెడ్డింగ్ గౌనులో టిఫానీ మెరిసిపోయారు. తన కూతురు టిఫానీని వెంటబెట్టుకొని వివాహ వేదికకు తీసుకువచ్చారు. ఈ వివాహానికి ట్రంప్ సహా ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్‌డ్ కుష్నర్, మెలానియా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, బరోన్ ట్రంప్ తదితరులు హాజరయ్యారు. ట్రంప్ దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారు. టిఫానీని వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చిన ట్రంప్ ఆ తర్వాత ఆమెకు ముద్దుపెట్టి వరుడు మైఖేల్‌కు వధువు చేతిని అందించారు. వధువుగా టిఫానీ ట్రంప్ లాంగ్ స్లీవ్ వెడ్డింగ్ గౌనులో మెరిసిపోగా..ఆమె తల్లి మార్లా లావెండర్ ఈవెనింగ్ గౌన్ తో కూతురికి ఏమాత్రం తగ్గని వన్నెతో మెరిసిపోయారు. వీరిద్దరి డ్రెస్సులను ఈ రెండింటినీ ప్రముఖ డిజైనర్ ఇలీ సాబ్ రూపొందించారు.

2018లో ఓ వెకేషన్ కోసం లండన్ వెళ్లినప్పుడు టిఫానీ ట్రంప్ తొలిసారిగా బౌలోస్‌ను కలిశారు.అలా వారి పరిచయం ప్రేమగా మారింది. మైఖేల్ సంపన్న లెబనీస్ కుటుంబానికి వారసుడు.. అప్పట్లో అక్కడి యూనివర్సిటీలో చదువుతుండేవాడు. ఆ తర్వాత 2019లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తమ ప్రేమను ప్రపంచానికి పరిచయం చేశారు. అనంతరం ఇరుకుటుంబాలు కూడా వారి ప్రేమను అంగీకరించి ఒకటి చేశాయి.

కాగా..డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆయన రెండో భార్య, నటి మార్ల మాపుల్స్‌ ఏకైక కూతురే టిఫానీ. 1993లో మార్లను ట్రంప్‌ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 1999లో విడాకులు తీసుకున్నారు. అనంతరం మెలానియాను డొనాల్డ్ ట్రంప్‌ వివాహమాడారు.