Dr Anthony Fauci : డేంజర్ డెల్టా.. అమెరికాలో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయి

అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌచీ కరోనా వైరస్‌కు సంబంధించి ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. గతేడాదిలా లాక్‌డౌన్‌లు విధించే పరిస్థితులు రానప్పటికీ ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా పెరుగుతోందన్నారు. ముఖ్యంగా డెల్టా వైరస్‌ ప్రభావంతో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయని ఫౌచీ హెచ్చరించారు.

Dr Anthony Fauci : డేంజర్ డెల్టా.. అమెరికాలో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయి

Dr Anthony Fauci

Dr Anthony Fauci america usa coronavirus covid-19 vaccine delta variant : అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌచీ కరోనా వైరస్‌కు సంబంధించి ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. గతేడాదిలా లాక్‌డౌన్‌లు విధించే పరిస్థితులు రానప్పటికీ ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా పెరుగుతోందన్నారు. ముఖ్యంగా డెల్టా వైరస్‌ ప్రభావంతో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయని ఫౌచీ హెచ్చరించారు.

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ చాలామంది ఇంకా టీకాలు తీసుకోలేదని, వీరివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. వ్యాక్సిన్ వేయించుకోని వారి ద్వారా వైరస్ ఇతరులకు వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. టీకాలు తీసుకోవడానికి ముందుకు రానివారు ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉన్న అమెరికన్ల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, అమెరికన్లలో ఇప్పటి వరకు 60 శాతం మంది టీకాలు వేయించుకోకపోవడం గమనార్హం.

‘ఇంకా 10 కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంది. వారు ముందుకు రావడం లేదు. తీవ్ర అనారోగ్యం, ఆస్పత్రి బారినపడకుండా టీకాలు సమర్థవంతంగా కాపాడతాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వైరస్ సోకినా.. వైరస్‌ నుంచి పూర్తి రక్షణ కలుగుతుంది. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకున్న 16కోట్ల మందిలో కేవలం 6,239 మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారు. వారిలో 1263 మంది ప్రాణాలు కోల్పోయారు’ అని అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC) వెల్లడించింది.

అమెరికాలో కొన్ని రోజులుగా రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. పది రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అక్కడ రెట్టింపు కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఫ్లోరిడా వంటి నగరాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వైరస్‌ బారినపడి ఆస్పత్రుల్లో చేరికలు కూడా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా ఇండోర్‌ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలంటూ సీడీసీ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

అగ్రరాజ్యం అమెరికాలోనూ డెల్టా వేరియంట్‌ తీవ్రత పెరిగింది. దీంతో నిత్యం పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ అమెరికాలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు ఉత్పన్నం కాకపోవచ్చని ఫౌచీ అంచనా వేశారు. కానీ, ప్రస్తుతం డెల్టా ప్రభావంతో పరిస్థితులు కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయని హెచ్చరించారు.