Drones Covid-19 Jabs : కరోనా వ్యాక్సిన్లను డెలివరీ చేస్తున్న డ్రోన్లు..

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. అనేక దేశాలు వ్యాక్సినేషన్ సమర్థవంతంగా నిర్వహించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

Drones Covid-19 Jabs : కరోనా వ్యాక్సిన్లను డెలివరీ చేస్తున్న డ్రోన్లు..

Drones Delivering Covid 19 Vaccines To Underserved Communities

Drones Delivering Covid-19 Vaccines : ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. అనేక దేశాలు వ్యాక్సినేషన్ సమర్థవంతంగా నిర్వహించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల ప్రజలకు వ్యాక్సినేషన్ అందేలా అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నాయి. మెట్రోపాలిటన్ నగరాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కరోనా వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా పంపిణీ చేస్తున్నాయి.

Drone

రోడ్డు రవాణా ద్వారా వైద్యఖర్చు పెరిగిపోతోంది. అందుకే తక్కువ పెట్టుబడితో తొందరగా కరోనా వ్యాక్సిన్లు అందరికి అందుబాటులోకి వచ్చేలా ఈ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే యూనైటెడ్ స్టేట్స్, ఇల్లియనస్, మిచిగాన్, అల్బామా రాష్ట్రాల్లో తమ నేషనల్ గార్డులతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్ కో కంపెనీ జిప్ లైన్ (Zipline) 2014లో స్థాపించారు. ఈ సంస్థ ఇటీవలే ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా Covid-19 వ్యాక్సిన్ డోస్ లను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయడం మొదలుపెట్టింది.

Drones

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు సమానంగా అందరికి అందుబాటులోకి వచ్చేలా కోవాగ్జ్ తో కలిసి ప్రాజెక్టులో పనిచేస్తోంది. టెస్టులు, ట్రీట్ మెంట్ల కోసం డ్రోన్లను అందిస్తోంది. ఘనాలో డ్రోన్ల ఆపరేషన్ మొదలు కాగా.. జిప్ లైన్ సంస్థ తమ డ్రోన్ల ద్వారా వచ్చే ఏడాదిలోగా 2.5 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను అందించేందుకు ప్లాన్ చేస్తోంది.

Zipline

చిన్నపాటి ఎయిర్ ప్లాన్ డ్రోన్లను జిప్ లైన్ డిజైన్లతో తయారుచేసింది. ఒక్కో డ్రోన్ దాదాపు నాలుగు పౌండ్ల బరువును 50 మైళ్లకు పైగా పంపిణీ చేయగలవు. కంపెనీ తన ఏడేళ్ల చరిత్రలో 115వేల వాణిజ్య డెలవరీలను పూర్తి చేసింది.

Dron

ఘానాలో తొలిరోజు వ్యాక్సిన్ల పంపిణీలో మొత్తం 36 డెలివరీల్లో 4500 టీకాలను పంపిణీ చేసింది. గంటకు 60మైళ్ల వేగంతో ఈ డ్రోన్లు ఆకాశంలో దూసుకుపోతాయి. ప్రస్తుతం ఈ కంపెనీ ఏడు పంపిణీ కేంద్రాలను ఆపరేట్ చేస్తోంది. 2021 చివరిలోగా మరిన్ని డెలివరీ సెంటర్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది.