దుబాయ్ లో రెండు వారాలు లాక్ డౌన్

  • Published By: chvmurthy ,Published On : April 5, 2020 / 03:55 AM IST
దుబాయ్ లో రెండు వారాలు లాక్ డౌన్

గల్ఫ్ దేశాలు కరోనాపై  పోరాటాన్ని ఉధృతం చేశాయి. దుబాయ్ లో శనివారం, ఏప్రిల్ 4వ తేదీ, రాత్రి నుంచి  రెండు వారాలపాటు  లాక్ డౌన్  విధించారు. ఎర్ర సముద్ర తీరమైన జెడ్డాలోని కొన్ని ప్రాంతాలను సౌదీ అరేబియా ఇప్పటికే మూసి వేసింది. 

మార్చి26 నుంచి  దుబాయ్ లో తప్ప మిగిలిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది.  UAE  యొక్క విపత్తు నిర్వహణ కమిటీ లాక్ డౌన్ ఇప్పుడు రెండు వారాల పాటు వుంటుందని ప్రకటించింది. 

పొరుగునే ఉన్న సౌదీ అరేబియాలో, జెడ్డాలోని ఏడు పరిసరాల్లో శనివారం రాత్రి నుంచి  లాక్ డౌన్  మరియు పాక్షిక కర్ఫ్యూను అధికారులు ప్రకటించారు. సౌదీ అరేబియాలో శనివారం వరకు 2,179 కరోనా అనుమానిత కేసులు నమోదు కాగా వారిలో 29 మంది మరణించినట్లు ఒక నివేదికతెలిపింది. దుబాయ్ లో ప్రజలు బయట తిరగటాన్నినిషేంధించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే సూపర్ మార్కెట్లు, మందుల దుకాణాలు. నిత్యావసర వస్తువుల షాపులు తెరిచే ఉంటాయి. ప్రజలు అవసరమైన వాటికి మాత్రమే బయటకు రావాలని, కుటుంబంలో ఒక్కరికే బయటకు వచ్చి కొనుక్కొని వెళ్లే వెసులుబాటు కల్పించారు. కీలక రంగాల్లో పనిచేసేవారికి లాక్ డౌన్, కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చారు. 

దుబాయ్ లో మెట్రోరైల్, ట్రామ్ సేవలను రెండు వారాల పాటు నిలిపివేశారు. ఉచితంగా  బస్సు రవాణా ఏర్పాటు చేసి, లాక్డౌన్ సమయంలో టాక్సీ ప్రయాణాలకు 50% డిస్కాంట్ ఇస్తున్నారు. అల్ రాస్ ప్రాంతానికి గతంలోనే కర్ఫ్యూ విధించిన ఎమిరేట్స్ ఇప్పుడు అక్కడ పెద్ద సంఖ్యలో వలసదారులు ఉన్న ప్రాంతాలలో విస్తృతమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. 

డిస్‌ఫెక్షన్ డ్రైవ్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ల కరోనా వ్యాధి సోకిల వారి సంఖ్య ఈనెల మొదటి 4 రోజులకు  840 వరకు  పెరిగాయి. వీధులు, పార్కులు, ప్రజా రవాణా వాహానాలు, బహిరంగ ప్రదేశాల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లడం ద్వారా క్రిములను చంపే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రిపూట కర్ఫ్యూను నిరవధికంగా పొడిగించారు.

ఏప్రిల్ 1నుండి 4వ తేదీ వరకు కరోనాఅనుమానిత కేసులు 1,505 కి  పెరిగాయి. ప్రజలు ఇంటి నుండి బయటకు వచ్చి తిరిగేటప్పుడు మాస్క్ లు ధరించాలని ప్రభుత్వం ఆదేశించేంది. సౌదీ అరేబియా, ఏడు జెడ్డా పరిసరాల్లోని  ప్రజలు  నిత్యావసరాల వస్తువుల కోసం  వైద్య సహాయం కోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు  మాత్రమే బయటకు రావటానికి అనుమతి ఇస్తున్నారు.