Dubai Sand Plot : అదొక ఇసుక దిబ్బ .. ధర మాత్రం రూ.279 కోట్లు..!!

ఓ ఇసుక దిబ్బ దిమ్మతిరిగే ధరకు అమ్ముడైంది. అలాంటిలాంటిది రేటు కాదు..వందల కోట్ల ధర పలికి రికార్డు క్రియేట్ చేసింది.

Dubai Sand Plot : అదొక ఇసుక దిబ్బ .. ధర మాత్రం రూ.279 కోట్లు..!!

Dubai Sand Plot Record rate

Dubai Sand Plot : అది అందమైన భవనం కాదు. పురాతన భవనం అంతకంటే కాదు. లగ్జరీ పెంట్ హౌస్ అంతకంటే కాదు. అదో ఇసుక దిబ్బ. పేరుకు ఇసుక దిబ్బేగానీ రూ.279కోట్లకు అమ్ముడైంది…! అదేంటీ ఇసుక దిబ్బ రూ.279 కోట్లా అని ఆశ్చర్యపోతాం. నిజమే ఆశ్చర్యం కలిగించేదే వార్త అవతుంది..సంచలనం అవతుంది. అదే జరిగింది భూతల స్వర్గంగా పేరొందిన దుబాయల్ లోని ఓ మానవ నిర్మిత ద్వీపంలోని ఓ ఇసుక దిబ్బ దుబాయ్ కరెన్సీలో (34 మిలియన్ డాలర్లు)కు అంటే భారత కరెన్సీలో రూ.279 కోట్లకు అమ్ముడై నోరెళ్లబెట్టేలా చేసింది. దుబాయ్ కరెన్సీలో 127 దినార్హ్ మ్ లకు అమ్ముడై మార్కెట్ లో పెను సంచలన క్రియేట్ చేసింది.

దుబాయ్‌లోని పార్శిల్ జుమైరా బే మానవ నిర్మిత ద్వీపంలోని 24,500 చదరపు అడుగుల స్థలాన్ని ఏప్రిల్ 19న వేలం వేయగా మొత్తం 125 మిలియన్ దిర్హామ్‌లకు (34 మిలియన్ డాలర్లు) అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. దుబాయ్ ప్రధాని భూభాగం నుంచి వంతెన ద్వారా సముద్రం మానవ నిర్మితంగా రూపొందిన గుర్రం అకారంలో ఉండే జుమైర్ బే ద్వీపంలో చదరపు అడుగుకు 5,000 దిర్హామ్‌ల కంటే ఎక్కువ పలికింది. నైట్ ఫ్రాంక్ బ్రోకరేజ్ సంస్థ ద్వారా ఈ డీల్ కుదిరి అమ్ముడైంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ పౌరుడు కానీ ఓ వ్యక్తి దీన్ని కొనుగోలు చేశారు. ఫ్యామిలీ వెకేషన్ కోసం అక్కడో ఇంటిని నిర్మించాలని భావించి దీన్ని కొనుగోలు చేసారు సదరు వ్యక్తి. వేలం నిర్వహించని సంస్థ మాత్రం కొనుగోలు దారుడి వివరాలను వెల్లడించలేదు. ‘ఈ ఇసుక దిబ్బ 125 మిలియన్ దిర్హామ్‌లు’ అంటూ దుబాయ్‌లోని నైట్ ఫ్రాంక్‌ ప్రైమ్ రెసిడెన్షియల్ హెడ్ ఆండ్రూ కమ్మింగ్స్ తెలిపారు. దీని గురించి ఆండ్రూ మాట్లాడుతు..సాధారణంగా అద్భుతమైన నిర్మాణాలు గల విల్లాలు, ప్రత్యేక డిజైన్ తో నిర్మాణమైన పెంట్‌హౌస్‌లు ఇటువంటి స్థాయి ధరలకు అమ్ముడు అవుతాయి..కానీ ఇక ప్లాట్ కు ఇంత భారీ ధర పలకటం నిజంగా అద్భుతమని అన్నారు.

దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఈ స్థలాన్ని రెండు సంవత్సరాల క్రితం 36.5 మిలియన్ దిర్హామ్ లకు కొనుగోలు చేశారు. అదికాస్తా ఇంకా పెరిగి తాజాగా 125 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడై 88.5 మిలియన్ల లాభాన్ని తెచ్చిపెట్టిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీమంతులకు కోవిడ్ సమయంలో దుబాయ్ చక్కటి అవకాశాలను కలిగింది. తక్కువ పన్ను శాతంతో విక్రయాలు జరిగి దుబాయ్ అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా నేరాలు కూడా అత్యంత తక్కువ శాతం ఉండటంతో దుబాయ్ అంటే పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. దీంతో దుబాయల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయాలుగా విరాజిల్లుతోంది. శ్రీమంతులైన భారతీయులు దుబాయ్ లో పెట్టుబడులు పెట్టటానికి బాగా ఆసక్తి చూపుతున్నారు.పైగా దుబాయ్ లో చమురు ధరలు అత్యంత స్వల్పంగా ఉండటం కూడా ఓ కారణం.

నగరంలో రష్యన్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నా.. గోల్డెన్ వీసాలు దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అమ్ముడైన జుమేరా బే ఐలాండ్‌‌‌లోని ఫ్లాట్.. ప్రభుత్వ డెవలపర్ మెరాస్ హోల్డింగ్ అభివృద్ది చేసిన 128లో ఒకటి. ఐకానిక్ పామ్ జుమేరా అభివృద్ధిలో ఉన్న వేలాది ఇళ్లతో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకమైందిట. దీంట్లో అన్ని ప్లాట్స్ కొన్నేళ్ల కిందటే అమ్మి చక్కటి లాభాలు ఆర్జించారు నిర్వాహకులు. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన హోటల్ బల్గారి రిసోర్ట్ ఇక్కడే ఉండటం మరో ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ ద్వీపంలో కొన్ని నివాసాలు మాత్రమే పూర్తి అయ్యాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అత్యంత ఖరీదైన హోటళ్లలో ఒకటైన బల్గారి రిసార్ట్‌తో పాటు భవిష్యత్ బల్గారి లైట్‌హౌస్ టవర్‌ కూడా ఇక్కడ ఉంది. ఇందులోని ఐదు పార్కింగ్ స్థలాలు, తొమ్మిది బెడ్ రూమ్ లతో పెంటహౌస్ అపార్ట్‌మెంట్ ఫిబ్రవరిలో 410 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడయ్యింది.