కరోనా భయం, 10వేల మూగజీవాలను చంపేయాలని ప్రభుత్వం నిర్ణయం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మనుషులకే కాదు మూగజీవాలకూ మృత్యువుగా మారింది. ఏ తప్పు చేయకున్నా శిక్ష అనుభంచాల్సిన పరిస్థితి

  • Edited By: naveen , June 7, 2020 / 11:58 AM IST
కరోనా భయం, 10వేల మూగజీవాలను చంపేయాలని ప్రభుత్వం నిర్ణయం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మనుషులకే కాదు మూగజీవాలకూ మృత్యువుగా మారింది. ఏ తప్పు చేయకున్నా శిక్ష అనుభంచాల్సిన పరిస్థితి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మనుషులకే కాదు మూగజీవాలకూ మరణశాసనంగా మారింది. ఏ తప్పూ చేయకున్నా శిక్ష అనుభంచాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా భయంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది. 10వేల మూగజీవాలను(మింక్) హతమార్చాలని నిర్ణయించింది. నెదర్లాండ్స్ లో మింక్‌లను(mink) వాటి వెంట్రుకల కోసం పెంచుతారు. కాగా, వీటికి కరోనా సోకుతున్నట్లు ఇటీవలే తెలిసింది. అలాగే ఈ జీవుల ద్వారా మనుషులకు కరోనా సోకుతోందని మే నెలలో గుర్తించిన ప్రభుత్వం.. వైరస్ వ్యాప్తిని నిరోధించడం కోసం వీటిని హతమార్చాలని నిర్ణయించింది. నెదర్లాండ్స్ ప్రభుత్వం రికార్డుల ప్రకారం మింక్‌ల ద్వారా ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకింది. ఇన్ ఫెక్షన్ సోకిన అన్ని మింక్ ఫార్స్మ్(mink farms) క్లియర్ చేయాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. 

ఏప్రిల్ లో తొలుత ఓ మింక్ కరోనా వైరస్ బారిన పడింది. రైతు నుంచి మింక్ కు కరోనా సోకింది. మింక్ లను చంపడానికి గ్యాస్ ఉపయోగిస్తున్నారు. అవి చనిపోయిన తర్వాత వాటి మృతదేహాలను డిస్పోజల్ ప్లాంట్ కు పంపుతారు. ఆ తర్వాత ఫార్మ్స్ ను క్రిమి సంహారకాలతో క్లీన్ చేస్తారు. నెదర్లాండ్స్ లో 140 మింక్ ఫార్మ్స్ ఉన్నాయి. ఏడాదికి 90 మిలియన్ యూరోల విలువ చేసే ఫర్ ను ఎగుమతి చేస్తోంది. మింక్ ల చంపడం రైతులకు బాధాకరమైన విషయమే అయినప్పటికి ప్రజల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తప్పడం లేదని ప్రభుత్వం చెప్పింది. కాగా, రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పింది.