Happy Perihelion Day : సూర్యునికి అతిదగ్గరగా భూమి.. ఏడాదిలో ఒకసారి జరిగే అద్భుతం!

Happy Perihelion Day : సూర్యునికి అతిదగ్గరగా భూమి.. ఏడాదిలో ఒకసారి జరిగే అద్భుతం!

Happy Perihelion Day- Earth is at perihelion : మన సౌర వ్యవస్థలో అన్ని గ్రహాలు, తోక చుక్కలు, గ్రహ కక్ష్యలు దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమిస్తుంటాయి. ప్రతి ఏడాదిలో భూమి జనవరి 2, 3 తేదీల్లో సూర్యునికి అతి దగ్గరగా వస్తుంది. జూన్ 4న సూర్యునికి అతి దూరంగా వెళ్తుంది. ఇప్పుడు కొత్త ఏడాది  2021 సంవత్సరంలోనూ జనవరి 2న భూమి సూర్యునికి అతిదగ్గరగా వచ్చింది. సూర్యుని కక్ష్య స్థానంలో భూమికి మధ్య అతి సమీపంలో ఉన్న స్థానాన్ని పెరిహిలియన్ అంటారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ సంఘటనను వార్షిక (Happy Perihelion Day) పెరిహిలియన్ రోజు‌గా పిలుస్తారు.

మరోమాటలో చెప్పాలంటే.. గ్రహాల కక్ష్యలో సూర్యునికి అతిదగ్గర బిందువుగా సూచిస్తారు. పెరిహిలియన్ అనే పదం ప్రాచీన గ్రీకు నుండి అనువదించారు. అంటే ‘సూర్యునికి దగ్గర’ అని అర్థం. శనివారం ఉదయం 8:51 గంటలకు భూమి పెరిహిలియన్‌ క్షక్ష్యకు చేరుకుంటుందని అంచనా. శనివారం ఆకాశంలో సూర్యుడు సుమారు 3శాతం పెద్దదిగా కనిపిస్తాడు. ఈ దృశ్యాన్ని కంటితో చూడలేమని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. సరైన కంటికి రక్షణ లేకుండా నేరుగా సూర్యున్ని చూడరాదని సూచిస్తున్నారు. భూ కక్ష్య.. కచ్చితమైన వృత్తం కాదంటున్నారు.

కొన్నిసార్లు గ్రహం మన నక్షత్రానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. కొన్నిసార్లు అది దూరంగా ఉంటుంది. సంవత్సరంలో దూరం సుమారు 3 మిలియన్ మైళ్లు మారుతుంది. భూమి నుండి చంద్రునికి దాదాపు 13 రెట్లు దూరంగా ఉంటుందని అంచనా. పెరిహిలియన్.. భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యలో వేగంగా కదులుతున్న క్షణాన్ని సూచిస్తుంది. ఈ గ్రహం ప్రస్తుతం సూర్యుని చుట్టూ సెకనుకు దాదాపు 19 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. జూలైలో సూర్యుడి నుంచి దూర ప్రాంతానికి చేరుకున్నప్పుడు కంటే సెకనుకు 6 మైళ్లు వేగంతో వెళ్తుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవి శీతాకాలం కంటే ఐదు రోజులు ఎక్కువ ఉంటుందంట.. శనివారం సూర్యరశ్మి మరింత తీవ్రంగా ఉన్నప్పటికీ.. భూమి అక్షం 23.5-డిగ్రీల వంపు కారణంగా ఉత్తర అర్ధగోళంలో శీతాకాలం ప్రభావితం కాదని సైంటిస్టులు చెబుతున్నారు.


ఇప్పటి నుంచి ఆరు నెలలు ఉంటే.. జూలై 5న, భూమి సూర్యుడి నుండి చాలా దూరంగా వెళ్తుంది. దీనిని అఫెలియన్ అని పిలుస్తారు. అంటే.. దీనిర్థం.. సూర్యుడికి దూరంగా.. పెరిహిలియన్ వద్ద, భూమి సూర్యుడి నుండి 91.5 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. అదే అఫెలియన్ వద్ద.. 94.5 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. పెరిహిలియన్, అఫెలియన్ మధ్య, సూర్యరశ్మి భూమిని తాకినప్పుడు దాని తీవ్రతలో 6.7% తేడా ఉంటుందంట. నాసా ప్రకారం, ఉత్తర అర్ధగోళంతో పోలిస్తే దక్షిణ అర్ధగోళంలో తీవ్రమైన సీజన్లకు కారణమవుతుందని నాసా పేర్కొంది.