లాక్ డౌన్ తో “భూమి” కదలికల్లో గణనీయమైన మార్పులు

  • Published By: veegamteam ,Published On : April 5, 2020 / 07:33 AM IST
లాక్ డౌన్ తో “భూమి” కదలికల్లో గణనీయమైన మార్పులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ సమయంలో మెుత్తం లాక్ డౌన్ చేయబడింది. దాంతో విమానాలు తిరగటం ఆగిపోయ్యాయి. రైలు నడవటం తగ్గింది. ఈ మహమ్మారి కారణంగా నగరాల్లోను, పట్టణాల్లోను రద్దీ తగ్గింది. కాలుష్యం కూడా తగ్గింది. భూమి కంపనాల తీవ్రతలో గణనీయంగా తగ్గినట్టు భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా భూ గ్రహం నిశ్చల స్థితిలో ఉందని అన్నారు.

బెల్జియంలోని రాయల్ అబ్జర్వేటరీలో భూవిజ్ఞాన శాస్త్రవేత్త, భూకంప శాస్త్రవేత్త థామస్ లెకోక్ మాట్లాడుతూ ఈ మహమ్మారి కారణాంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి దేశ రాజధాని బ్రస్సెల్స్ ప్రాంతంలో భూకంప శబ్దంలో 30 నుంచి 50 శాతం తగ్గినటు గుర్తించాం అని సిఎన్ఎన్ నివేదికలో వెల్లడించారు.

భూకంప శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం మనం ఇప్పుడు ఎటువంటి చిన్న శబ్దానైన గుర్తించగలుతున్నాం. అంతేకాకుండా అతి చిన్న ప్రకంపనాలను గుర్తించగలం అని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా మనం తక్కువ శబ్దంతో కూడిన సిగ్నల్ పొందుతున్నాం. అతి చిన్న శబ్దాన్ని వినగలుగుతున్నాం అని వాషింగ్టన్ డిసీలోని ఇన్కార్పొరేటెడ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూషన్స్ ఫర్ సీస్మోలజీలో భూకంప శాస్త్రవేత్త ఆండీ ఫ్రాస్సెట్టో అన్నారు. ఇలాంటి కంపనాల తీవ్రత తగ్గుదలకు సంబంధించిన పరిశోధలను లాస్ ఏంజిల్స్, వెస్ట్ లండన్, యుకెలోను శాస్త్రవేత్తలు గమనించినట్లు చెప్పారు.

మానవ నాగరికతకు దూరంగా, వాహనాలు తిరగని ప్రాంతాల్లో భూకంపనాల తీవ్రతలో మార్పును చూడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మహమ్మారి కారణంగా అందరు ఇళ్లకు పరిమితం అవ్వటం, రద్దీ తగ్గటం వల్ల భూకంపనాల కదలికల్లో గణనీయంగా తగ్గుదల కనిపించింది. ఈ మహమ్మారిని నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఇంట్లో ఉండటం మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.