ఇరాన్ అణువిద్యుత్ కేంద్రం సమీపంలో భూకంపం: అమెరికా దాడి అని భయపడ్డ స్థానికులు

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 06:23 AM IST
ఇరాన్ అణువిద్యుత్ కేంద్రం సమీపంలో భూకంపం: అమెరికా దాడి అని భయపడ్డ స్థానికులు

ఇరాన్‌ లోని బుషెహక్ పట్టణంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 4.9గా గుర్తించింది యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే. బుషెహక్  అణు కర్మాగారం సమీపంలో ఒక్కసారిగా వచ్చిన భూప్రకంపణలతో జనం ఉలిక్కి పడ్డారు.ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

మధ్య తూర్పు దేశాల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ.. తీవ్ర భయాందోళనలకు గురి తీస్తోంది. యుద్ధానికి సంకేతాలు వెలువడ్డాయనేంత తీవ్రత నెలకొంది. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌లో వెంటవెంటనే సంభవించిన రెండు భూకంపాలు మరింత భయోత్పాతాలకు తావిచ్చాయి.

అణువిద్యుత్ కేంద్రం సమీపంలో.. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బుధవారం అర్ధరాత్రి క్షిపణులను ప్రయోగించింది. ఈ ఘటన చోటు చేసుకున్న సరిగ్గా నాలుగు గంటల తరువాత.. రెండు భూకంపాలు ఇరాన్‌ను వణికించాయి. అందులో ఒకటి- అణువిద్యుత్ కేంద్రం సమీపంలో సంభవించటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అమెరికా చేసిన దాడేమోనని స్థానికులు భయపడ్డారు. కానీ ఈ రెండు భూకంపాలు కూడా సహజసిద్ధంగా ఏర్పడినవేనని..అమెరికా దాడుల వల్ల కాదంటూ వార్తలు వెలువడ్డాయి. దీనితో ఇరానీయులు ఊపిరి పీల్చుకున్నారు.