రష్యాలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు

రష్యాలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ (యూఎస్ జీఎస్) సర్వే వెల్లడించింది. 

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 05:18 AM IST
రష్యాలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు

రష్యాలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ (యూఎస్ జీఎస్) సర్వే వెల్లడించింది. 

రష్యాలో స్వల్ప భూకంపం సంభవించింది. తూర్పు ప్రాంతం భూకంపంతో వణికిపోయింది. కేమ్ చాంటాలోని కమాండర్ దీవులు గజగజలాడాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ (యూఎస్ జీఎస్) సర్వే వెల్లడించింది. 

రష్యాలోని పలనా నగరానికి 74 కిలో మీటర్ల దూరంలో 14 కిలో మీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమైనట్లు యూఎస్ జీఎస్ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.13 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లుగా ఎలాంటి సమాచారం లేదు. 

కమాండర్ దీవుల్లో బేరింగ్, మెడ్నీలతోపాటు 15 చిన్న దీవులున్నాయి. భూకంప కేంద్రం నుంచి సుమారు 82 కిలో మీటర్ల వరకు భూ ప్రకంపనల ప్రభావం ఉన్నట్లు యూఎస్ జీఎస్ తెలిపింది. భూకంప కేంద్రం నుంచి 300 కిలో మీటర్ల పరిధిలో సునామీ సంభవించే ముప్పుందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడింది.