జూలో జంతువులకు ఎగ్ హంటింగ్ గేమ్..భలే ఆడి ఆహారాన్ని ఎలా సాధించాయో చూడండీ..

జూలో జంతువులకు ఎగ్ హంటింగ్ గేమ్..భలే ఆడి ఆహారాన్ని ఎలా సాధించాయో చూడండీ..

London Zoo Egg Hunt Game

Easter speacial  meerkats,monkeys egg hunt : ఈస్టర్ పండుగ. క్రైస్త్రవులు ఎంతగానో ఎదురు చూసే పండుగ. దేవుని కుమారుడైన ఏసయ్యను శిలువ వేసి సమాధి చేసిన తరువాత ఏసయ్య పునరుద్ధానుడై మూడవ రోజు సమాధిని గెలిచి సజీవుడైన పండుగ ఈస్టరు పండుగ. ఈ ఈస్టరు పండుగ సందర్భంగా లండన్ లోని ఓ జూలో నిర్వహించే ఎగ్ హంటింగ్ గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఈ ఎగ్ హంట్ గేమ్ ని లండన్ జూలో కోతులు, మీర్కాట్స్ ఎలా ఆడాయో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.

1

ఏసుక్రీస్తు సమాధి నుంచి సజీవుడుగా లేచిన సందర్భంగా క్రైస్తవులు అత్యంత ఇష్టంగా..ఆనందంగా జరుపుకునే ఈస్టర్ పండుగను ప్రత్యేకంగా నిర్వహించారు లండన్ జూ నిర్వాహకులు. రంగులు వేసిన కోడిగుడ్ల లాంటి ఆకారాలను పేపర్లతో తయారుచేశారు జూ నిర్వాహకులు. వాటిని మీర్కాట్లు,ఉడుతల్లాంటి కోతులు ఉన్న జోన్లలో చెట్లకు తగిలించారు.

4

తాము గెంతుతూ..తిరుగుతూ ఆడుకునే చోట ఎప్పుడూ ఇటువంటి కొత్త కొత్త ఆకారాలు కనిపించడంతో పైగా అవి రంగు రంగుల్లో ఉండటంతో వాటిని ఉడుత కోతులు, మీర్కాట్లు తేరిపార చూశాయి. వింతగా చూశాయి. తలలు విచిత్రంగా తిప్పుతూ వాటిని చూసి ఆశ్చర్యపోయాయి. రంగు రంగుల్లో కనిపించే ఆ సరికొత్త ఆకారాలను చూసి తెగ సంబరపడిపోయాయి.

10

ఒకదాని తరువాత మరొకదాన్ని పట్టుకుని చేతుల్లోకి తీసుకుని వాటిని తిరగేసి..బోర్లేసి వింతగా చూశాయి. అంతేవాటికేదో ఆడుకోవటానికి ఓ కొత్త పరికరాలు దొరికినట్లుగా వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి.

5

జూ నిర్వాహకులు… ఆ జంతువులు తినే ఆహారాన్ని ఆ ఆకారాల్లో పెట్టారు గేమ్ ను రక్తి కట్టించటానికి. వాళ్లు ఊహించినట్లుగానే ఈ బుజ్జి బుజ్జి జంతువులు వాటిని వెదుకుతూ పైగా వాటిల్లో ఉండే ఆహారం తీసుకునేందుకు అవి అన్ని ఆకారాలనూ వెదకటం మొదలుపెట్టాయి.

11

కాగా బ్రిటన్ లో కొత్త కరోనా కేసులు పెరుగుతుండటంతో జూలను మూసివేశారు. ఈక్రమంలో జూలో సందడి లేకపోవటంతో జూ నిర్వహకులు ఈస్టర్ పండుగను ప్రత్యేకంగా జరపాలని ఇలా ప్లాన్ చేశారు. ఆ వీడియోలో ఈ బుజ్జి జంతువులు ఆ వింత ఆకారాలను వెతకే తీరు భలేగా ఉంది.

9

ఈ ఎగ్ హంట్ గేమ్ గురించి జూ నిర్వహకులు మాట్లాడుతూ..”సాధారణంగా బ్రిటన్ లో చలి ఎక్కువగానే ఉంటుంది. కొన్ని నెలలు పాటు చలిలోనే ఉన్నాం. ఈస్టర్ వచ్చాక..వెచ్చదనం మొదలవుతుంది. ఈ వెచ్చదనం చాలా బాగుంటుంది. అందుకే జంతువులకు ఎగ్ హంట్ నిర్వహించడం సరైన టైమ్ అనుకున్నాం” అని యానిమల్ మేనేజర్ ఏంజెలా ర్యాన్ తెలిపారు.

7

“ఉడుత కోతులు చాలా యాక్టివ్ గా ఉంటాయి. కొత్తది ఏదైనా వాటి కళ్లబడితే అంతే వాటి అంతు తేల్చకుండా వదలవ్..చాలా ఉత్సుకతతో ఉంటాయవి. అవి తినే ఆహారాన్ని ఈస్టర్ బాస్కెట్లలో దాచిపెట్టాం. కొత్తగా కొన్ని ఆకారాలు కనిపించేసరికి అవి చక్కగా ఆ స్నాక్స్ కోసం అవి ఉబలాటపడుతూ వెతుక్కున్నాయి.

6

ఇక మీర్కాట్ల విషయానికొత్త అవి అత్యంత జాగ్రత్తగా ఉంటాయి. ముందూ వెనుక చూసి ఆలోచిస్తాయి. అలా అన్ని అన్ని జంతువులకూ సరిపడా స్నాక్స్‌ని బాస్కెట్లలో ఉంచి ఇచ్చాం ఈ గేమ్ ద్వారా అందించాం” అని ఏంజెలా తెలిపారు.

nbsp;