వారానికి 7సార్లే భోంచేసే సీఈఓ

వారానికి 7సార్లే భోంచేసే సీఈఓ

నెలకు వంద రూపాయల జీతంతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ట్విట్టర్ సీఈఓ మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టి ట్రెండింగ్ అయ్యాడు. జాక్ డార్సీ వారానికి ఏడు సార్లే భోంచేస్తాడట. అది కూడా కేవలం డిన్నర్ మాత్రమే తింటాడు. బుధవారం ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. విపాస్సన యోగా& ఉపవాసం పద్ధతిని బాగా ఫాలో అవుతానని.. లైఫ్ స్టైల్ గురించి కీలక విషయాలు చెప్పాడు. 

ఐస్ బాత్.. రాత్రికి డిన్నర్లో చికెన్, చేపలు లేదా ఫైబర్ ఉండే ఏదైనా మాంసంతో పాటు ఆకుకూరలు తింటాడట. ‘డిస్సెర్ట్‌లా బెర్రీస్‌ను, డార్క్ చాక్లెట్‌ను తీసుకుంటాను’అని చెప్పాడు. రోజూ 2గంటల పాటు ధ్యానంలో ఉంటాడట. ప్రతి రోజూ కాకుండా అప్పుడప్పుడు ఐస్ బాత్ చేస్తానని వివరించాడు.

జాక్ డార్సీ గతేడాది తనను తాను ఉపవాసంతో ఉంచుకోవడం వల్ల యాక్టివ్ గా ఉంచుకుంటానని చెప్పి దుమారం లేపాడు. ‘రోజులో నేను చాలా ఫోకస్ గా ఉంటాను. ఇదే దృష్టితో ఉంటే.. పదినిమిషాల్లో నిద్రలోకి జారుకోవచ్చు. అలా లేకపోతే చాలా సమయమే పట్టొచ్చు. డార్సీ రోజూ నడుచుకుంటూనే ఆఫీసుకు వెళ్తూ సీ విటమిన్ తీసుకుంటారు. 

డార్సీ కాలిక్యులేషన్ ప్రకారం.. ఉదయం 15నిమిషాల పాటు ఐస్ బాత్ చేస్తే మైండ్ అన్ లాక్ అవుతుందట. దాంతో ఎలాంటి ఛాలెంజ్ అయినా క్షణాల్లో తీసుకోగలరట. మరో 3నిమిషాలు ఐస్ బాత్ చేయడం వల్ల రిలాక్స్ అవడానికి ఉపయోగపడుతుందట.