ప్రాణం పోదులే: క్రికెట్ ఆడకపోతే ఇంగ్లాండ్‌కు రూ.3వేల కోట్ల నష్టం

ప్రాణం పోదులే: క్రికెట్ ఆడకపోతే ఇంగ్లాండ్‌కు రూ.3వేల కోట్ల నష్టం

కరోనా మహమ్మారి ధాటికి ప్రాణాలు కాపాడుకునేందుకు యావత్ ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇంగ్లాండ్ క్రికెట్ రాబోయే వేల కోట్ల నష్టాన్ని తల్చుకుని లబోదిబోమంటుంది. రిపోర్టుల ప్రకారం.. కరోనా ప్రభావం తగ్గకపోతే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ కు రాబోయే సీజన్లో అక్షరాలా రూ.2వేల 835కోట్లు నష్టం వస్తుంది. ఈ మేరకు బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ ఉద్యోగులకు వేతనం ఇవ్వలేక వారిని మాన్పించాలని అనుకుంటున్నారట. 

దాంతో పాటు ఇంగ్లాండ్ కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్లేయర్ల శాలరీలోనూ 20శాతం శాలరీని తగ్గించాలనుకుంటున్నారు. మహమ్మారి కారణంగా ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్. ఈ శాలరీల్లో కోతలు రాబోయే మూడు నెలల వరకూ ఉండొచ్చని అంచనా. 

‘మహమ్మారి ప్రభావం పెద్ద చాలెంజింగ్‌గా మారింది. మోడరన్ క్రికెట్‌పై చాలా ప్రభావం చూపిస్తుంది. ఇది మాయని మచ్ఛగా మిగిలిపోతుంది. ఈ సీజన్ మొత్తాన్ని మిస్సవడమంటే దాదాపు 300మిలియన్ పౌండ్లను కోల్పోయినట్లే. మే 28వరకూ ఎటువంటి ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ లు జరగవుు. ఏప్రిల్ 12న జరగాల్సి ఉన్న మ్యాచ్ లను కూడా రద్దు చేశాం.

మా స్టాఫ్, ప్లేయర్లు, కొలీగ్స్, ప్రజల భద్రతే మా ఛాలెంజ్. తర్వాత క్రికెట్ నెట్ వర్క్ మెయింటైన్ చేయడం. రాష్ట్రం సంక్షోభంలో నుంచి చక్కటి భవిష్యత్ వైపుగా దిశలు వేస్తుంది. పరిస్థితుల దృష్ట్యా వేతనాల్లో కటింగ్ తప్పనిసరి. జాతి భద్రత ప్రమాదంలో పడింది. ప్రతి ఒక్క సింగిల్ నిర్ణయంపై భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. 

Also Read | లాక్ డౌన్ టైమ్‌లో బయటకు వస్తే కాల్చి చంపేయండి