ఎనిమిదేళ్ల బుడ్డోడి యూట్యూబ్ ఆదాయం రూ.184.39కోట్లా

ఎనిమిదేళ్ల బుడ్డోడి యూట్యూబ్ ఆదాయం రూ.184.39కోట్లా

జనరేషన్ స్పీడ్ కాదు సూపర్ స్పీడ్ అయింది. ర్యాన్ కాజీ అనే ఎనిమిదేళ్ల బుడ్డోడి యూట్యూబ్ ఛానెల్ 2019 ఆదాయం రూ.26మిలియన్ డాలర్లు అంటే రూ.184.39కోట్లకు పై మాటే. 2015లో పెట్టిన ఈ చిన్నారి చానెల్ నెమ్మెదిగా ఆరంభమై క్రమంగా ఊపందుకుంది. ర్యాన్ టాయ్స్‌రివ్యూ అనే పేరిట మొదలై 22.9మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించగలిగింది. 

 

ఒక వీడియోకు 35బిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఆశ్చర్యకరమైన విషయమే. ఈ బుడ్డోడి వీడియోలు ఎంత ఫ్యామస్ అయ్యాయంటే అత్యద్భుతమైన ఫీట్స్ చేసే టెక్సాస్ కంపెనీను వెనుకపడేలా చేసింది. హెలికాఫ్టర్ లో నుంచి బాస్కెట్‌బాల్స్ ఆడే ఫీట్ ల కంటే ర్యాన్ రివ్యూనే నచ్చడం మొదలుపెట్టాయి వినియోగదారులకి. 

 

టెక్సాస్‌లో ఉండే షియాన్‌ కాజీ, లోన్‌ కాజీల కొడుకే ర్యాన్‌ కాజీ. తండ్రి పని ముగిసిన తర్వాత యూట్యూబ్‌ చూస్తూ ఉండేవాడు. అది చూసి ఒకరోజు ర్యాన్‌.. షియాన్‌ను తాను వీడియోలు చేస్తానని అడిగాడు. వెంటనే ‘ర్యాన్‌ టాయ్స్ రివ్యూ’ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. లెగో రైలు సెట్‌ను కొనుక్కుని వచ్చి ర్యాన్‌‌తో రివ్యూ వీడియోను పోస్టు చేయించారు. 

 

ఆరంభంలో నిదానంగా మొదలైనా.. ‘ర్యాన్‌ ఫిక్సర్‌ కార్‌’ రివ్యూకు భారీ స్పందన వచ్చింది. 935 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ర్యాన్‌ సెలబ్రిటీగా మారిపోయి వీడియోలకు బాగా డిమాండ్‌ పెరిగింది. యూట్యూబ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ర్యాన్‌ మొదటిస్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ర్యాన్ 2018 సంవత్సర ఆదాయం 22మిలియన్ డాలర్లు, 2019లో 26మిలియన్ డాలర్లతో నెం.1స్థానానికి చేరుకున్నాడు. 

 

ఇప్పటివరకు అతను వెయ్యి కోట్లకు పైగానే సంపాదించాడు. ప్రజలను వినియోగదారులుగా మార్చటానికి ప్రతి ఒక్కరినీ ప్రచారకర్తగా మార్చుకోవటమే కార్పొరేట్ వ్యూహం. చిన్నపిల్లలు చేస్తున్నారనగానే వీక్షకులు చూపే ఆసక్తి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ఆసక్తే వాళ్లను వస్తువులు కొనేలా చేస్తుంది.