Crocodile Attack : జస్ట్ మిస్.. బతికిపోయాడు.. చొక్కాతో మొసలిని పట్టుకోవాలని ప్రయత్నం.. కట్ చేస్తే.. వీడియో వైరల్

ఓ వృద్ధుడు చొక్కాతో మొసలిని ట్రాప్ చేయాలని దుస్సాహసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. జస్ట్ లో మిస్ అయ్యింది.. లేదంటే.. అతడు మొసలి చేతిలో చచ్చేవాడు. దానికి ఆహారంగా మారిపోయి ఉండేవాడు.

Crocodile Attack : జస్ట్ మిస్.. బతికిపోయాడు.. చొక్కాతో మొసలిని పట్టుకోవాలని ప్రయత్నం.. కట్ చేస్తే.. వీడియో వైరల్

Crocodile Attack : మొసలిని దూరం నుంచి చూసినా చాలు.. ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. భయంతో కాళ్లు, చేతులు వణుకుతాయి. వెన్నులో వణుకు పుడుతుంది. అది ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీళ్లలో ఉన్నప్పుడే కాదు.. నీటి బయట కూడా మొసలితో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం తేడా వచ్చినా.. యమలోకానికి టికెట్ తీసుకున్నట్టే.

అలాంటిది.. మొసలిని బంధించాలంటే.. ఎంతో కేర్ ఫుల్ గా ఉండాలి. అయితే, ఓ వృద్ధుడు చొక్కాతో మొసలిని ట్రాప్ చేయాలని దుస్సాహసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. జస్ట్ లో మిస్ అయ్యింది.. లేదంటే.. అతడు మొసలి చేతిలో చచ్చేవాడు. దానికి ఆహారంగా మారిపోయి ఉండేవాడు.

మొసలిని పట్టుకునేందుకు ఆ వ్యక్తి ఓ చొక్కాను దాన్ని ముఖంపైకి విసిరాడు. చొక్కాతో దాన్ని కళ్లను కవర్ చేశాడు. ఈ విషయంలో అతడు సక్సెస్ అయ్యాడు. దాని కళ్లు కనిపించకుండా చొక్కాతో కవర్ చేయగలిగాడు. ఇంకేముంది.. దాన్ని పట్టుకోవడం చాలా సులభం అనుకున్నాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆ తర్వాత వెనుక నుంచి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఊహించని ఘటన జరిగింది. సడెన్ గా మొసలి తిరగబడింది. అతడిపై దాడి చేసింది. చేయిని కొరికింది. అయితే, ఆ వ్యక్తికి ఇంకా భూమ్మీద నూకలు మిగిలే ఉన్నట్టు ఉన్నాయ్. అతగాడు మొసలి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఏ మాత్రం భయపడకుండా దాన్ని కాలితో తన్నడంతో అది అతడిని వదిలేసింది. దాంతో ఆ పెద్దాయన సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉన్న ఈ వీడియో చూసినోళ్లంతా వామ్మో.. అంటున్నారు. మొసలితో గేమ్స్ ఏంటని మండిపడుతున్నారు. జస్ట్.. మిస్.. బతికిపోయాడు.. అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భూమ్మీద ఇంకా నూకలు మిగిలే ఉన్నాయ్.. అందుకే బతికి బట్టకట్టాడు అని కామెంట్ పెట్టారు. అది చాలా డేంజర్.. అని తెలిసి కూడా ఇలాంటి దుస్సాహసం చేయడం కరెక్ట్ కాదంటున్నారు.