Elon Musk: హతవిధీ.. ఎలన్ మస్క్‌ను షర్ట్ లేకుండా చూడాల్సి వచ్చిందే

"హతవిధీ ఇవాళ ఎలన్ మస్క్‌ను షర్ట్ లేకుండా చూడాల్సి వచ్చిందే. గ్రీస్ లో ఎంజాచ్ చేస్తున్న మస్క్‌ను మీరు కూడా చూడండి" అంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం మస్క్ ట్విట్టర్ తో 44బిలియన్ డాలర్లకు సంబంధించిన లీగల్ పోరాటం చేస్తున్న వేళ..

Elon Musk: హతవిధీ.. ఎలన్ మస్క్‌ను షర్ట్ లేకుండా చూడాల్సి వచ్చిందే

Elon Musk

 

Elon Musk: “హతవిధీ ఇవాళ ఎలన్ మస్క్‌ను షర్ట్ లేకుండా చూడాల్సి వచ్చిందే. గ్రీస్ లో ఎంజాచ్ చేస్తున్న మస్క్‌ను మీరు కూడా చూడండి” అంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం మస్క్ ట్విట్టర్ తో 44బిలియన్ డాలర్లకు సంబంధించిన లీగల్ పోరాటం చేస్తున్న వేళ ఏ మాత్రం బెంగ.. బెరుకూ లేకుండా ఫ్రెండ్స్ తో కలిసి గ్రీస్ లోని లగ్జరీ వేకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే గ్రీస్‌లోని మైకోనోస్‌లో షర్ట్ లేకుండా తిరుగుతున్న ఫొటో ఒకటి వైరల్ అయింది.

టెస్లా ఫౌండర్ ఏం చేసినా వింతగానే భావించే మీడియా.. మస్క్ నీటితో ఎంజాయ్ చేస్తూ డ్రింక్స్ తాగుతున్న ఫొటోలను కూడా పబ్లిష్ చేసింది. మస్క్ తో పాటు ఫ్యాషన్ డిజైనర్ సారా స్టాడింజర్, ఆమె భర్త అరి ఎమ్మాన్యుయేల్ లు కూడా ఈ ట్రిప్ లో ఉన్నారు.

వీరి ఎంజాయ్‌మెంట్ కు అయ్యే ఖర్చు వారానికి 20వేల డాలర్లు. అంటే దాదాపు రూ.16లక్షలు. ఈ డబ్బుతో ఆరుగురు గెస్టులకు సరిపడా మూడు కేబిన్లు, ఒక ప్రొఫెషనల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.

Read Also : ఎలన్ మస్క్‌పై ట్విటర్‌ దావా..ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక బ్లాక్ స్మిమ్ డ్రస్ లో ఉన్న మస్క్.. సముద్రంలోకి దూకుతూ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఏవియేటర్ సన్ గ్లాసెస్ ధరించి, బోట్ చుట్టూ తిరుగుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.

ట్విటర్ కొనుగోలుకు జరిగిన 44 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. విలీన ఒప్పందంలో భాగంగా ఫేక్ అకౌంట్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడంలో ట్విటర్ విఫలమైందని ఆరోపించారు. ట్విటర్ వ్యాపార కార్యకలాపాలు, ఫైనాన్షియల్ పెర్ఫామెన్స్ దీనితోనే ముడిపడి ఉన్నాయని అన్నారు. డీల్ పూర్తి కావాలంటే ఈ సమాచారం తప్పనిసరి అని.. ఆ విషయంలో ట్విటర్ విఫలమైందని ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.