Home » International » మళ్లీ నెంబర్ 1, ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలన్ మస్క్
Publish Date - 4:43 pm, Fri, 19 February 21
Elon Musk Is Again the World’s Richest: టెస్లా(Tesla) సీఈవో ఎలన్ మస్క్(Elon Musk) మళ్ల నెంబర్ 1 అయ్యాడు. మరోసారి జెఫ్ బెజోస్‌ను(Amazon Jeff Bezos) వెనక్కినెట్టేశాడు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలన్ మస్క్ నిలిచాడు. మస్క్ నికర ఆస్తుల విలువ 930 కోట్ల డాలర్లు నుంచి 19వేల 900 కోట్ల డాలర్లకు చేరడంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. మస్క్ రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్(SpaceX) మరో విడత నిధుల సమీకరణను పూర్తి చేయడం అతడికి కలిసొచ్చింది.
ఇక అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నికర ఆస్తులు మస్క్ సంపదతో పోలిస్తే 600 కోట్ల డాలర్లు తక్కువగా 19వేల 420 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. టెస్లా షేర్లు ఇటీవల విపరీతంగా పెరగడంతో నికర ఆస్తుల విలువలో బెజోస్‌ను మస్క్ అధిగమించాడు. ఇక మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ గతవారం మరో విడత ఈక్విటీ ఫండింగ్ రౌండ్‌ను పూర్తి చేసుకోవడంతో కంపెనీ విలువ 7వేల 400 కోట్ల డాలర్లకు ఎగబాకింది.
ప్రపంచ కుబేరుల జాబితాలో దాదాపు ఆరు వారాల పాటు నిరాటంకంగా మొదటి స్థానంలో కొనసాగాడు ఎలన్ మస్క్. కాగా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంపద పెరగడంతో అతడు తొలిస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంతలోనే మళ్లీ ఎలన్ మస్క్ తన నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు.
2017 నుండి మూడేళ్లపాటు బెజోస్ కుబేరుల జాబితాలో తన ఆధిక్యాన్ని కనబర్చాడు. తొలి స్థానంలోనే కొనసాగాడు. బెజోస్ 1995 లో ఆన్‌లైన్ పుస్తక దుకాణంగా ప్రారంభించిన సంస్థను 71.7 ట్రిలియన్ గ్లోబల్ ఇ-కామర్స్ సంస్థగా మార్చాడు. అమెజాన్ కార్యకలాపాలు విస్తరిస్తున్న కొద్దీ కంపెనీ షేర్ల విలువ పెరుగుతూ వచ్చింది. దీంతో కంపెనీలో అతి పెద్ద వాటాదారు అయిన బెజోస్ సంపద కూడా పెరుగుతూ వచ్చింది.
2021 సంవత్సరం బెజోస్ కి చాలా ప్రత్యేకమైందని చెప్పొచ్చు. సీఈవో పదవి నుండి వైదొలగి, ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు అధిపతిగా ఉన్న ఆండీ జాస్సీకి ఆ బాధ్యతను అప్పగించాలని బెజోస్ నిర్ణయించాడు. అమెజాన్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా అపర కుబేరుల జాబితాలో నెంబర్ 2గా ఉండటం గమనార్హం.
Elon Musk : కోతి మెదడులో చిప్, అచ్చం మనిషిలాగే పనిచేస్తుందంట..త్వరలోనే మనుషులపై ప్రయోగం
Sri Lanka-Amazon : బికినీలు, ఇన్నర్ వేర్స్ అమ్మటం ఆపండీ..అమెజాన్ కు శ్రీలం సర్కార్ విన్నపం
2021లో ప్రపంచ కుబేరులని మించిన అదానీ సంపద
ఈ ఏడాదిలో రెండుసార్లు లోగో మార్చేసిన అమెజాన్.. ఎందుకో తెలుసా?
ప్రయోగించిన నిమిషాల్లోనే..స్పేస్ ఎక్స్ రాకెట్ మళ్లీ పేలిపోయింది
మళ్లీ ఆసియా నెంబర్‌వన్‌గా ముఖేశ్ అంబానీ