Musk wants Twitter again: ట్విటర్ కొనుగోలుకు మరోసారి సిద్ధమైన ఎలాన్ మస్క్.. ఒక్కో షేర్‌ 54.20 డాలర్ల కొనుగోలుకు ప్రతిపాదన

టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ తన మనసు మార్చుకున్నాడు. ట్విటర్ కొనుగోలుకు మరోసారి ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది.

Musk wants Twitter again: ట్విటర్ కొనుగోలుకు మరోసారి సిద్ధమైన ఎలాన్ మస్క్.. ఒక్కో షేర్‌ 54.20 డాలర్ల కొనుగోలుకు ప్రతిపాదన

Elon Musk

Musk wants Twitter again: బిజినెస్ మాగ్నెట్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ తన మనసు మార్చుకున్నాడు. ట్విటర్ కొనుగోలుకు మరోసారి ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం ట్విటర్ షేర్ 13శాతం దూసుకెళ్లి 47.95 డాలర్ల కు చేరాయి. అయితే ఎలన్ మస్క్ హెడ్‌గా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ 3శాతం పడిపోయిందని బ్లూమ్ బెర్గ్ పేర్కొంది.

Elon Musk vs Jellon Ski Twitter War: క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమంటూ ఎలన్ మస్క్ ట్వీట్.. మండిపడ్డ జెలన్ స్కీ.. ఇరువురి మధ్య ట్విటర్ వార్..

బ్లూమ్ బెర్గ్ సమాచారం ప్రకారం.. మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు మరోసారి సిద్ధమవుతూ లేఖలో ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. మస్క్ ఏప్రిల్ లో ట్విటర్ ను 44బిలియన్ డార్లకు ( సుమారు రూ.3.50లక్షల కోట్లు) కొనుగోలు చేయడానికి అంగీకరించాడు. ఈ మేరకు ట్విటర్ సంస్థ నుంచి ఒప్పంద కుదుర్చుకున్నాడు. వాటాదార్లుసైతం ఈ లావాదేవీకి ఆమోదం తెలిపారు. అయితే ఉన్నట్లుండి మస్క్ ఒప్పందం నుంచి విరమించుకున్నాడు. నకిలీ ఖాతాల సంఖ్యకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విటర్ విఫలమైందన్న ఆరోపణలతో ఒప్పందాన్ని రిద్దు చేసుకుంటున్నట్లు మస్క్ జులైలో ప్రకటించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

మస్క్ ఒప్పందం రద్దు చేసుకోవడం పై ట్విటర్ కోర్టును ఆశ్రయించింది. అక్టోబర్ 17న డెలావేర్ చాన్సెరీ కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ట్విటర్ కొనుగోలుకు మరోసారి మస్క్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే, ఒక్కో షేర్ ను 54.20 డాలర్ల చొప్పున కొనుగోలుకు మస్క్ ట్విటర్ సంస్థకు లేఖ రాసినట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ విషయంపై ట్విట్టర్ ప్రకటనను విడుదల చేసింది.. మస్క్ మద్దతుదారుల నుండి వారు SECకి దాఖలు చేసిన లేఖను మేము అందుకున్నామని తెలిపింది. ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున లావాదేవీని ముగించడం కంపెనీ ఉద్దేశమని తెలిపింది.