Elon Musk: నా ఫిట్‌నెస్ సీక్రెట్ అదే.. వెల్లడించిన ఎలన్ మస్క్

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు. 51 ఏళ్ల వయసున్న మస్క్ అంతకంటే తక్కువ వయసున్నట్లుగానే కనిపిస్తాడు. దీనికి గల కారణాన్ని ఆయన ఇటీవల వెల్లడించాడు.

Elon Musk: నా ఫిట్‌నెస్ సీక్రెట్ అదే.. వెల్లడించిన ఎలన్ మస్క్

Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈవో ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడు అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వయసు 51. అయితే, ఆయన చూడ్డానికి ఇంకా తక్కువ వయసున్నట్లుగానే కనిపిస్తాడు. ఎప్పుడూ ఎనర్జీతో, యాక్టివ్‌గానే ఉంటాడు.

CM KCR New Party: దసరా రోజు మరోసారి పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ.. ఆ రోజే కొత్త పార్టీపై ప్రకటన?

దీని గురించి ఆయనను మీడియా తరచూ అనేక ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. తన ఫిట్‌నెస్ సీక్రెట్ వెల్లడించమని మీడియా అడుగుతుంటుంది. సోషల్ మీడియాలోనూ యూజర్లు దీనిపై ప్రశ్నిస్తుంటారు. తాజాగా దీనిపై ఎలన్ మస్క్ స్పందించాడు. ఒక ఈవెంట్‌కు హాజరైన ఎలన్ మస్క్ ఉపవాసం ఉండటమే తన హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సీక్రెట్ అని వెల్లడించాడు. కొంతకాలం క్రితం ఒక స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తున్నట్లు చెప్పాడు. ‘‘ఒక మంచి స్నేహితుడి సలహా మేరకు అప్పుడప్పుడూ ఉపవాసం ఉంటున్నాను.

TRS Or BRS: టీఆర్ఎస్ కాదు.. ఇకపై బీఆర్ఎస్! దసరా రోజే ప్రకటన.. ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్

దీనివల్ల చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్లు అనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు. గత నెలలో ఎలన్ మస్క్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను ఇటీవల ఉపవాసం చేయడం ద్వారా 9 కిలోల బరువు తగ్గినట్లు చెప్పాడు. అప్పుడప్పుడూ తాను అలాంటి హెల్త్ సీక్రెట్స్ చెబుతుంటానని, అవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఫాలో అవ్వొచ్చని ఎలన్ మస్క్ చెప్పాడు.