Elon Musk: ఎలన్ మస్క్ సెన్సాఫ్ హ్యూమర్ టెస్లా డబ్బును ఎలా కాపాడిందో తెలుసా..

ఎలోన్ మస్క్ లోని ఫన్నీ కోణాన్ని అతణ్ని సోషల్ మీడియాల్లో ఫాలో అయ్యేవారు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన సెన్సాఫ్ ఆఫ్ హ్యూమర్ కంపెనీకి ఫ్రీ పబ్లిసిటీ ఎలా తెచ్చిపెట్టిందో చెప్తున్నారు.

Elon Musk: ఎలన్ మస్క్ సెన్సాఫ్ హ్యూమర్ టెస్లా డబ్బును ఎలా కాపాడిందో తెలుసా..

Elon Musk (1)

Elon Musk: ఎలోన్ మస్క్ లోని ఫన్నీ కోణాన్ని అతణ్ని సోషల్ మీడియాల్లో ఫాలో అయ్యేవారు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన సెన్సాఫ్ ఆఫ్ హ్యూమర్ కంపెనీకి ఫ్రీ పబ్లిసిటీ ఎలా తెచ్చిపెట్టిందో చెప్తున్నారు.

‘మనం ప్రజలను ఎంటర్ టైన్ చేస్తుంటే.. వాళ్లు మన గురించి స్టోరీలు రాస్తుంటారు. అప్పుడు మనం అడ్వర్టైజింగ్ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. అలా కార్ల ధరను తగ్గించేయొచ్చు. నేను సరదాగా ఉంటాను. సెన్సాఫ్ హ్యూమర్ తో ప్రవర్తిస్తాను’ అని మస్క్ అంటున్నారు.

టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టేందుకు గానూ.. స్ట్రీట్ లెవల్ జాబ్ లు కల్పించానని అంటున్నారు ఎలోన్ మస్క్.. వాల్ స్ట్రీట్ లో బోలెడు ఉద్యోగాలు ఆఫర్ చేశాను. ఆ తర్వాత తగ్గించానని అంటున్నారు. మే8న అతను హోస్ట్ గా వ్యవహరించిన శాటర్ డే నైట్ లైవ్ కార్యక్రమం చూసిన వారెవరూ దీనిని ఒప్పుకోరు.

దీనిపై మిక్స్ డ్ రివ్యూలు వస్తాయని ముందుగానే ఊహించిన మస్క్ కు అలాగే రెస్పాన్స్ రావడంతో సక్సెస్ అయ్యానంటున్నారు. చివరిసారిగా వీడియో గేమ్ క్యారెక్టర్ వారియోలా కనిపించిన మస్క్… అతను హ్యూమర్ గురించి విల్లింగ్‌టన్‌లోని చాన్సెరీ కోర్టులో లాయర్ ర్యాండీ బారోన్ తో చర్చించారు.