Bit Coin: ఎంత పని చేశావ్ ఎలోన్ మస్క్… బిట్ కాయిన్‌పై కీలక నిర్ణయం

టెస్లా సీఈవో ఎలోన్‌ మస్క్‌ చేసిన ట్వీట్‌ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌పై భారీ ఎఫెక్ట్ చూపించింది. తన కంపెనీ అయిన టెస్లా కార్ల కొనుగోలుకు బిట్‌కాయిన్‌ను ...

Bit Coin: ఎంత పని చేశావ్ ఎలోన్ మస్క్… బిట్ కాయిన్‌పై కీలక నిర్ణయం

Bit Coin

Bit Coin: టెస్లా సీఈవో ఎలోన్‌ మస్క్‌ చేసిన ట్వీట్‌ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌పై భారీ ఎఫెక్ట్ చూపించింది. తన కంపెనీ అయిన టెస్లా కార్ల కొనుగోలుకు బిట్‌కాయిన్‌ను అనుమతిస్తామని గతంలో మాటిచ్చాడు. తాజాగా తన నిర్ణయం మార్చుకున్న మస్క్.. సదరు క్రిప్టోకరెన్సీని ఇకపై తన కార్ల కంపెనీ కొనుగోలుకు వినియోగించేందుకు అనుమతించమంటూ ట్వీట్‌ చేశారు.

బిట్‌కాయిన్‌ కోసం భారీగా విద్యుత్‌ ఖర్చు చేయాల్సి వస్తోందని, పర్యావరణానికి పెద్ద ఎత్తున హాని జరుగుతోందనే కారణంతో ఆపేస్తున్నట్లు మస్క్‌ పేర్కొన్నారు. ఇకపై బిట్‌కాయిన్‌ను టెస్లా కార్ల కొనుగోలుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు.

మస్క్‌ ప్రకటనలతో ఒక్కసారిగా బిట్‌కాయిన్‌ విలువ క్షీణించింది. దాదాపు 15 శాతం క్షీణించి 46వేల డాలర్ల పైన ట్రేడవుతోంది. క్రిప్టో కరెన్సీ ట్రెండింగ్ లో ఉండటంతో సోషల్‌మీడియాలో వెంటనే మీమ్స్‌, ట్రోల్స్‌ మొదలయ్యాయి. గతంలో ఇదే మస్క్‌ బిట్‌కాయిన్‌ను ప్రోత్సహించడం వల్ల దాని విలువ అమాంతం పెరిగిపోయింది.

అదే విషయాన్ని గుర్తు చేస్తున్న నెటిజన్లు.. దానిని దృష్టిలో ఉంచుకుని మస్క్‌ నిర్ణయాలపై బిట్‌కాయిన్‌ విలువ ఆధారపడి ఉందంటూ మీమ్స్‌ రూపొందిస్తున్నారు. మరికొందరైతే ఇప్పుడే మస్క్‌కు పర్యావరణం గుర్తొచ్చిందంటూ సెటైర్ వేస్తున్నారు.