Elon Musk’s Fortune : ఒక్క రోజే 2.71లక్షల కోట్లు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద

స్పేస్​ ఎక్స్​, టెస్లా సంస్థల అధినేత ఎలాన్​ మస్క్ చరిత్ర సృష్టించారు. సోమవారం ఒక్కరోజే ఎలాన్ మస్క్ సంపద  రూ.2.71 లక్షల కోట్లు పెరిగింది. ఒక్క రోజులో సంపద విలువ ఈ స్థాయిలో పెరగడం

Elon Musk’s Fortune : ఒక్క రోజే 2.71లక్షల కోట్లు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద

Musk (1)

Elon Musk’s Fortune స్పేస్​ ఎక్స్​, టెస్లా సంస్థల అధినేత ఎలాన్​ మస్క్ చరిత్ర సృష్టించారు. సోమవారం ఒక్కరోజే ఎలాన్ మస్క్ సంపద  రూ.2.71 లక్షల కోట్లు పెరిగింది. ఒక్క రోజులో సంపద విలువ ఈ స్థాయిలో పెరగడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు.

అయితే హోర్జ్ట్ గ్లోబల్ హోల్డింగ్స్ తాజాగా 1,00,000 టెస్లాలకు ఆర్డర్ ఇవ్వడమే ఎలాన్ మస్క్ సంపద ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం. హోర్జ్ట్ టెస్టాకు ఆర్డర్ ఇచ్చిందన్న వార్త బయటకు రాగానే మంగళవారం ఒక్కరోజులో టెస్లా షేరు దాదాపు 15 శాతం ఎగబాకి 1045 డాలర్లకు చేరింది.

దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్​ కంపెనీగా టెస్లా ఘనత సాధించింది. ట్రిలియన్​ డాలర్​ కంపెనీల జాబితాలో చేరిన తొలి ఆటోమొబైల్​ కంపెనీ కూడా టెస్లానే. టెస్లాలో మస్క్​ వాటా 23 శాతం మేర ఉంది. ఇది సుమారు 289 బిలియన్​ డాలర్లు. 2021లోనే మస్క్​ సంపద 119 బిలియన్​ డాలర్లు పెరగడం విశేషం. అయితే మస్క్ కు స్పెస్ఎక్స్‌లో కూడా భారీగా వాటాలు ఉన్నాయి.

ALSO READ Covaxin : కోవాగ్జిన్ కు మరికొన్ని గంటల్లో WHO అనుమతి!