Elon Musk Tweet: ట్విటర్‌లోకి రీఎంట్రీపై ఆసక్తిచూపని ట్రంప్.. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే?

ట్విటర్ లో తన ఖాతాను యాక్టివ్ చేసినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిచూపలేదు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. తాను ట్విటర్ లోకి వచ్చేందుకు ఆసక్తిగా లేనని, తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో నేను ప్రజలకు నా అభిప్రాయాలను తెలిజేస్తున్నానని అన్నాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ట్రంప్ ఖాతాను యాక్టివ్ చేసి వారం అవుతున్నా ఇప్పటికీ ఒక్కపోస్టు కూడా చేయలేదని మస్క్ ను ప్రశ్నించాడు.

Elon Musk Tweet: ట్విటర్‌లోకి రీఎంట్రీపై ఆసక్తిచూపని ట్రంప్.. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే?

Elon Musk

Elon Musk Tweet: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్‌ను బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్న తరువాత కీలక మార్పులు చేస్తున్నారు. సంస్థలోని సగంమందికిపైగా ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న మస్క్.. అదేస్థాయిలో ట్విటర్లో ఏడాదికాలంగా నిషేదాన్ని ఎదుర్కొంటున్న మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను మళ్లీ పునరుద్దరించాడు. ఇందుకోసం ట్విటర్ లో మస్క్ పోల్ నిర్వహించాడు. ఈ పోల్‌లో భాగంగా ట్రంప్ ఖాతాను తిరిగి యాక్టివ్ చేయాలంటూ అధికశాతం మంది ఓటువేశారు. దీంతో ట్రంప్ ఖాతాను మస్క్ తిరిగి యాక్టివ్ చేశాడు.

ట్విటర్ లో తన ఖాతాను యాక్టివ్ చేసినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిచూపలేదు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. తాను ట్విటర్ లోకి వచ్చేందుకు ఆసక్తిగా లేనని, తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో నేను ప్రజలకు నా అభిప్రాయాలను తెలిజేస్తున్నానని అన్నాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ట్రంప్ ఖాతాను యాక్టివ్ చేసి వారం అవుతున్నా ఇప్పటికీ ఒక్కపోస్టు కూడా చేయలేదని మస్క్ ను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మస్క్ ‘ ట్రంప్ ట్వీట్ చేయకపోవడంతో నేను బాగానే ఉన్నాను అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. అయితే, చట్టం, సేవా నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ, ట్రంప్‌ను ట్విటర్ నుంచి నిషేధించడం ఘోర తప్పిందమని మస్క్ అన్నాడు. ఆ తప్పిదాన్ని సరిదిద్దుకున్నామని తెలిపాడు.

సిట్టింగ్ ప్రెసిడెంట్‌ను ట్విటర్ నుంచి నిషేధించడం వల్ల అమెరికాలో సగం మందికి ట్విటర్ పై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసిందని మస్క్ అన్నాడు. అయితే గత అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ కంటే జో బిడెన్ ను ఎంచుకున్నట్లు మస్క్ తెలిపాడు. కానీ, ఇప్పుడు బిడెన్ పరిపాలనతో నిరాశ చెందానంటూ పేర్కొన్నాడు.