Elon Musk: పేరు మార్చుకునేందుకు పిటిషన్ వేసిన మస్క్ ట్రాన్స్‌జెండర్ కూతురు

ఎలన్ మస్క్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె తన పేరును మార్చడానికి పిటిషన్ దాఖలు చేసింది. "నేను ఇకపై నా పుట్టుకకు కారణమైన తండ్రితో ఏ విధమైన సంబంధంతో గానీ, పేరుతో గానీ జీవించాలనుకోవడం లేదు"

Elon Musk: పేరు మార్చుకునేందుకు పిటిషన్ వేసిన మస్క్ ట్రాన్స్‌జెండర్ కూతురు

Elon Musk

Elon Musk: ఎలన్ మస్క్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె తన పేరును మార్చడానికి పిటిషన్ దాఖలు చేసింది. “నేను ఇకపై నా పుట్టుకకు కారణమైన తండ్రితో ఏ విధమైన సంబంధంతో గానీ, పేరుతో గానీ జీవించాలనుకోవడం లేదు”

పేరు మార్పు, కొత్త లింగ గుర్తింపును సూచించే కొత్త బర్త్ సర్టిఫికేట్ రెండింటి కోసం ఏప్రిల్‌లో శాంటా మోనికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా కొన్ని ఆన్‌లైన్ మీడియా కథనాలలో ప్రచారం కావడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

PlainSite.orgలో ఉంచిన కోర్టు పత్రాల ప్రకారం.. కాలిఫోర్నియాలో ఇటీవల 18వ సంవత్సరాలు నిండిన మాజీ జేవియర్ అలెగ్జాండర్ మస్క్, తన లింగ గుర్తింపును మార్చాలని తన కొత్త పేరును నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోర్టును కోరారు.

Read Also : ఎలన్‌మస్క్‌ను విమర్శించిన స్పేస్‌ఎక్స్ ఉద్యోగులపై వేటు..!

అలా ఆమెకు ఆన్‌లైన్ డాక్యుమెంట్‌లో కొత్త పేరును సవరించారు. ఆమె తల్లి జస్టిన్ విల్సన్, 2008లోనే మస్క్‌కి విడాకులు ఇచ్చింది.

మే నెలలో పేరు, లింగ మార్పు డాక్యుమెంట్లు దాఖలు చేయబడిన నెల తర్వాత, మస్క్ రిపబ్లికన్ పార్టీకి తన సపోర్టును ప్రకటించారు. దీని ఎన్నికైన ప్రతినిధులు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో లింగమార్పిడి హక్కులను పరిమితం చేసే చట్టానికి మద్దతు ఇచ్చారు.