Emetophobia : ఆ భయంతో ఆరేళ్లుగా ఇంటి గడప దాటని మహిళ

35ఏళ్ల మహిళ ఎమ్మా డేవిస్ ఆరు సంత్సరాలుగా ఇల్లు కదల్లేదు. ఎమెటోఫోబియా (Emetophobia) తో ఆమె బైటకు వెళ్లాలంటేనే భయపడిపోతోంది. ఈ Emetophobiaతో ఎమ్మా వాంతి అవుతుందేమో అనే ఆలోచనే ఉంటుంది 24 గంటలూ.

Emetophobia : ఆ భయంతో ఆరేళ్లుగా ఇంటి గడప దాటని మహిళ

Emetophobia

Emetophobia: భయం..భయం..భయం. కొంతమందికి బొద్దింకలంటే భయం,మరికొందరికి బల్లులంటే భయం. ఇంకొందరికి బైటకెళితే యాక్సిడెంట్ అవుతుందనే భయం. ఇలా భయాలు అనేక రకరకాలు. కానీ ఓ మహిళకు ఉండే విచిత్రమైన భయంతో గత ఆరు సంవత్సరాల నుంచి ఇంట్లోంచి బైటకు వెళ్లటంలేదు. అలా ఆరేళ్లనుంచి ఇంటి గడప కూడా దాటటం లేదు 35 ఏళ్ల మహిళ.

UK లోని Swansea కి చెందిన 35ఏళ్ల మహిళ ఎమ్మా డేవిస్. ఇద్దరి పిల్లల తల్లి. ఆమెకు ఎమెటోఫోబియా (Emetophobia) ఉంది. దీంతో ఆమె బైటకు వెళ్లాలంటేనే భయపడిపోతోంది. దీంతో ఇల్లు కదలదు. ఎక్కడికి వెళ్లదు. ఈ Emetophobiaతో ఎమ్మా వాంతి అవుతుందేమో అనే ఆలోచనే ఉంటుంది 24 గంటలూ. సాధారణంగా మనకు జ్వరం, తలనొప్పి. తిన్న ఆహారం అరగనప్పుడు వాంతి అయ్యేలా అనిపిస్తుంది. ఒక్కోసారి అవుతుంది కూడా. అలా వాంతి అయిపోతే ఫ్రీ అయిపోతాం. కానీ ఎమ్మాకు మాత్రం వాంతి అవ్వదు. కానీ అదే ఫీలింగ్ తో ఉంటుంది. ఎప్పుడూ వాంతి అవుతుందనే అనిపిస్తూనే ఉంటుంది. పైగా ఈమెలో బాగా పెరిగిపోయింది. ఎంతగా ఆ భయం పెరిగిందంటే ఇంటినుంచి కాలు బైటపెట్టనంతగా. దీంతో ఎమ్మా గత ఆరు సంవత్సరాల నుంచి ఇంట్లోంచీ బయటకు వెళ్లట్లేదట. ఈ పరిస్థితి వల్ల ఆమె జీవితమే మారిపోయింది.

గత పదేళ్లుగా ఎమ్మా డేవిస్ ఎమెటోఫోబియాతో బాధపడుతోంది. ఆమెకు రోజంతా వాంతి అవుతుంది అనే ఫీలింగ్ కంటిన్యూగా ఉంటుంది. దీంతో ఆమె ఇంట్లోంచి బైకు వెళ్లటం మానేసింది ఆరేళ్లనుంచి. ఇంట్లో ఉంటే ఏం కావట్లేదా డౌట్ వస్తుంది. ఇంట్లో ఉన్నా ఆమెకు ఆ సమస్య అలాగే ఉంటోందట.అదే ఫీలింగ్ తో చాలాసార్లు వాంతులు కూడా అయ్యాయి. ‘‘నింరతరాయంగా ఉండే ఈ వామ్టింగ్ ఫీలింగ్ నా జీవితాన్నే నాశనం చేస్తోంది” అని ఎమ్మా వాపోతోంది. ఇది నా జీవితానికి పట్టిన పీడలాగా ఉంది.

“ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంటోందంటే..ఒక్కోసారి నేను నా గది నుంచి కూడా బయటకు రాలేకపోతున్నాను. ఎక్కడికీ వెళ్లాలని అనిపించదు. దీంతో టైమ్ అంతా వేస్ట్ అవుతోంది. ఈ సమస్యతో ఏమీ చేయలేకపోతున్నా..ఎప్పుడూ ఇదే ఆలోచన నా మైండ్‌లో ఉంటోంది. ప్రతీ రోజు..ప్రతీ నిమిషం అదే ఫీలింగ్ వాంతి అవుతుందేమో..వాంతి అవుతుందేమోనని..ఇదే గోల.

ఎమ్మాకి 12 ఏళ్ల కిందట ఈ ఫోబియా బాగా పెరిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందంటే… చిన్నప్పుడు ఓసారి వాంతి చేసుకుంది. అది చూసి చాలా భయపడింది. వయసు పెరిగే కొద్దీ… వాంతుల్ని చూసినప్పుడల్లా భయం పెరిగిపోతూనే వచ్చింది. అది చాలా చాలా పెరిగిందే కాని తగ్గలేదు. తన చదువు పూర్తి అయినప్పటినుంచి ఉద్యోగం చేస్తోంది.

జాబ్ కు వెళ్లినప్పుడు చాలా సార్లు వాంతులు అయ్యాయి. బస్సులో వెళ్తున్నప్పుడూ అదే సమస్య. దీంతో ఆమె పని మానేసింది. ఓ రోజు 6 సార్లు వాంతులు అయ్యాయి. ఈ సమస్య వల్ల అస్తమానూ బాత్రూమ్ కు వెళ్లటం..వాంతి చేసుకోవటం చాలా ఇబ్బందిగా తయారైంది. దీంతో తనకు ఉద్యోగం ఇచ్చినవాళ్లను ఇలా ఎంత కాలం అయిన ఇబ్బంది పెట్టం అని అనుకుంది. అంతే జాబ్ మానేసింది. ఇంట్లోనే ఉన్నా అదే సమస్య. కానీ తప్పటంలేదు. దీంతో ఎమ్మా ఆ వాంతుల ఫీలింగ్ నుంచి తప్పించుకోవటానికి ఎన్నో కౌన్సిలింగ్ లు కూడా తీసుకుంది. ఆ సమస్య నుంచి తప్పించుకుని సాధారణ జీవితం గడపటానికి ఎమ్మా..ప్రస్తుతం రకరకాల థెరపీలు, సైకో థెరపీల వంటివి చేయించుకుంటోంది. కానీ ఏవీ పని అవ్వట్లేదట. ఈ దరిద్రమైన ఫోబియా ఎప్పుడు పోతుందో… నని పాపం ఎమ్మా ఆశగా థెరపీలు కంటిన్యూ చేస్తోంది.