Emirates Airbus : గాల్లో ఉన్న విమానానికి రంధ్రం-14 గంటలు గాల్లోనే ప్రయాణం

ఎయిర్ పోర్టులోంచి టేకాఫ్ తీసుకున్న విమానం గాల్లో ఎగురుతుండగా రంధ్రం పడితే ఎలాగ ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి.... భయం వేసిందా.... కానీ రంధ్రం  పడింది.

Emirates Airbus : గాల్లో ఉన్న విమానానికి రంధ్రం-14 గంటలు గాల్లోనే ప్రయాణం

Emirates Airbus

Emirates Airbus :  ఎయిర్ పోర్టులోంచి టేకాఫ్ తీసుకున్న విమానం గాల్లో ఎగురుతుండగా రంధ్రం పడితే ఎలాగ ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి…. భయం వేసిందా…. కానీ రంధ్రం  పడింది. రంధ్రం పడిన విమానం దాదాపు 14 గంటల పాటు ప్రయాణించి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత విమాన సిబ్బంది గమనించిన ఘటన జులై 1వ తేదీ చోటు చేసుకుంది.

ఎమిరేట్స్ కు చెందిన ఎయిర్ బస్   ఏ380 విమానం దుబాయ్ నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ కు బయలు దేరింది. అయితే గమ్యస్ధానంలో ల్యాండింగ్‌కు   కొద్దిసేపటి ముందు పైలట్లు… అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను  సంప్రదించారు. టేకాఫ్ సమయంలో విమానం టైరు పేలిందని అనుమానం వ్యక్తం   చేస్తూ ల్యాండింగ్ కు అనుమతి కోరారు. సురక్షితంగా ల్యాండ్ అయ్యాక విమానాన్ని పరిశీలించి చూడగా ఎడమ రెక్క కింది భాగంలో రంధ్రం పడి ఉండటాన్ని గుర్తించారు.

విమానం ఇంకా బ్రిస్బేన్ ఎయిర్ పోర్టులోనే ఉందని ఎమిరేట్స్ ప్రతినిధులు తెలిపారు, అధికారులు తనిఖీ చేశారని విమానం లోపలి భాగం, ఫ్రేమ్ నిర్మాణంపై   ఎలాంటి ప్రభావం పడలేదని చెప్పారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని తెలిసింది. టేకాఫ్ సమయంలో లేదా… టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగి ఉండవచ్చని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. ఆసమయంలో విమానంలో పెద్ద శబ్దం వినిపించిందని… దాదాపు 45 నిమిషాల పాటు అది కొనసాగిందని చెప్పారు. అయితే క్యాబిన్ సిబ్బంది ప్రశాంతంగా ఉన్నారని రెక్కలు ఇంజన్ లను తనిఖీ చేశారన్నారు.

Also Read : Tirumala Income : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. పదేళ్ల రికార్డు బద్దలు