20 Minutes late..Job Dismissal : 20నిమిషాలు లేటుగా ఆఫీసుకొచ్చినందుకు ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం

ఏడు ఏళ్ల నుంచి కేవలం ఒకే ఒక్కసారి కేవలం 20 నిమిషాలు ఆఫీసుకు లేటుగా వచ్చినందుకు యాజమాన్యం షాక్ ఇచ్చింది. 20 నిమిషాలు లేటుగా వచ్చినందుకు ఏకంగా ఉద్యోగం నుంచి తీసివేసింది.

20 Minutes late..Job Dismissal : 20నిమిషాలు లేటుగా ఆఫీసుకొచ్చినందుకు ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం

Employee Fired For Being Late For First Time 20 Minutes : : ఓ ఉద్యోగికి యాజమాన్యం కోలుకోలేని షాక్  ఇచ్చింది. కేవలం 20 నిమిషాలు ఆఫీసుకు లేటుగా వచ్చినందుకు ఎటువంటి సూచనలు..హెచ్చరికలు..నోటీలు ఇవ్వకుండానే ఏకంగా ఉద్యోగం నుంచి తీసివేసింది. అలా అని అతను ప్రతీరోజు లేట్ గా వస్తాడు అనుకుంటే పొరపాటే. ప్రతీరోజు ఆఫీసు నియమిత సమయానికే వస్తాడు. అలా అతను ఉద్యోగంలో చేరినప్పటినుంచి సరైన సమయానికే వస్తాడు. కానీ పాపం ఏమైందో గానీ ఒకే ఒక్క రోజు గత ఏడేళ్లలో ఒకే ఒక్క రోజు లేటుగా వచ్చాడు.దీంతో సదరు ఆఫీజు యాజమాన్యం ఆ ఉద్యోగిని తీసివేసింది. ఆఫీసుకు సమయానికి రావాలి. కరక్టే. కానీ అనివార్య కారణాల వల్ల సరైన సమయానికి ఆఫీసుకు రావటం లేట్ అవ్వొచ్చు. అంతమాత్రానికే ఏకంగా ఉద్యోగం నుంచి తీసివేయటంపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. కనీసం సూచించి ఉండాల్సింది. లేదా నోటీసు ఇవ్వాల్సింది. అని అంటున్నారు.

గత ఏడేళ్లలో ఒకేసారి 20 నిమిషాలు లేటుగా వచ్చిన తన కొలిగ్ ను ఉద్యోగం నుంచితొలిగించినట్లుగా తన సహ ఉద్యోగి ఒకరు ఈ విషయాన్ని రెడిట్‌లో షేర్‌ చేయటంతో ఈ విషయం బయటపడింది. కానీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు. రెడిట్‌లోని యాంటీవర్క్‌ ఫోరమ్‌లో ఈ పోస్ట్‌ను షేర్‌ చేశారు ఓ వ్యక్తి. సంస్థలో ఏడేళ్లకుపైగా పని చేస్తూ మొదటి సారి జస్ట్ 20 నిమిషాలు లేటుగా వచ్చినందుకు ఉద్యోగంలో నుంచి తొలగించారని పేర్కొన్నారు.

ఆ వ్యక్తిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని మిగితా సిబ్బంది ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ‘అతడిని తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు రేపటి నుంచి నాతో పాటు నా సహ ఉద్యోగులు ఆఫీసుకు లేటుగా రావాలని నిర్ణయించాం…ఇలా మా నిరసనను..డిమాండ్ ను తెలియజేస్తున్నాం’ అని పేర్కొన్నారు. 79వేల మంది దీనికి మద్దతుగా నిలిచారు. సంస్థ యాజమాన్యం నిర్ణయాన్ని చాలా మంది యూజర్లు కూడా విమర్శలు కురిపించారు. ఆ ఉద్యోగిని కావాలనే ఉద్యోగం నుంచి తీసివేశారని విమర్శించారు.