అత్యుత్తమ క్రికెటర్స్ గా స్టోక్స్, పెర్రీ  

అత్యద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన ఇంగ్లండ్ టాప్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు.

అత్యుత్తమ క్రికెటర్స్ గా స్టోక్స్, పెర్రీ   

అత్యద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన ఇంగ్లండ్ టాప్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు.

అత్యద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన ఇంగ్లండ్ టాప్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. 2019 సంవత్సరానికి గానూ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ గా స్టోక్స్ ను ఎంపిక చేసినట్లు విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ ప్రకటించింది. 2005 సంవత్సరంలో ఆండ్రూ ఫ్రింటాఫ్ తర్వాత ఒక ఇంగ్లండ్ ప్రేయర్ దీనికి ఎంపిక కావడం ఇదే తొలిసారి. (సీఎం సారు చెప్పిన ‘బలుసు ఆకు’ అంటే ఏంటో తెలుసా?)

వరుసుగా మూడు సంవత్సరాలు లీడింగ్ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ ఎంపిక కాగా, ఇప్పుడు స్టోక్స్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇంగ్లండ్ మొదటిసారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్ లోనూ స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. తర్వాత కొద్ది రోజులకే టెస్టు క్రికెట్ లో అత్యుత్తుమ ఇన్నింగ్స్ లలో ఒకటి ఆడాడు. హెడింగ్లీలో జరిగిన యాషెస్ సిరీస్ మూడో టెస్టులో 135 పరుగులు చేసి ఇంగ్లండ్ కు విజయం అందించాడు. 

మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలీన్ పెర్రీ ఉత్తమ ప్లేయర్ గా ఎంపికయ్యారు. 2016లోనూ అదే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారానికి రెండు సార్లు ఎంపికైన తొలి మహిళగా పెర్రీ నిలిచింది. యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ, అర్ధ సెంచరీ చేయడంతోపాటు వన్డేలో 73 సగటుతో, టి20ల్లో 150 సగటుతో పరుగుల సాధించారు. మరో 27 వికెట్లు తీసింది. టి20ల్లో వరల్డ్ లీడింగ్ క్రికెటర్ గా వెస్టిండీస్ ఆల్ రౌండర్ రసెల్ ఎంపికయ్యారు.