Ethiopia : ఇథియోపియాలో ఎమర్జెన్సీ విధింపు

యుద్ధమేఘాలు కమ్ముకున్న ఇథియోపియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్న నేపథ్యంలో దేశంలో ఆరు నెలలపాటు జాతీయ అత్యయిక స్థితిని

Ethiopia : ఇథియోపియాలో ఎమర్జెన్సీ విధింపు

Ethiopea (1)

Ethiopia యుద్ధమేఘాలు కమ్ముకున్న ఇథియోపియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్న నేపథ్యంలో దేశంలో ఆరు నెలలపాటు జాతీయ అత్యయిక స్థితిని(national state of emergency)విధిస్తున్నట్లు మంగళవారం ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల వ్యూహాత్మక నగరాలైన డెస్సీ మరియు కొంబోల్చాపై నియంత్రణను స్వాధీనం చేసుకున్నటిగ్రే బలగాలు దేశ రాజధాని ఆడిస్​ అబబాను ఆక్రమిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జాతీయ అత్యయిక స్థితి విధించిన నేపథ్యంలో ఇథియోపియోలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించవచ్చు, రవాణా సేవలు నిలిపివేసే అవకాశముంది. తీవ్రవాద సమూహంతో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానించబడిన ఎవరినైనా నిరవధికంగా నిర్బంధించే అవకాశముంది. కొన్ని ప్రాంతాలలో స్థానిక పాలనాయంత్రాగాలు రద్దు చేయబడవచ్చు మరియు సైనిక నాయకత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.

కాగా, సరిగ్గా ఏడాది క్రితం పొరుగు దేశం నుండి సైనికులు టిగ్రే ప్రాంతంపై దాడి చేయడానికి మరియు టిగ్రే రెబల్స్ ను వెంబడించడానికి ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అనుమతించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇథియోపియన్ మంత్రుల మండలి చేసిన ప్రకటన  టిగ్రే బలగాలకు స్పష్టమైన హెచ్చరికగా ఉంది.

ఇథియోపియాలో పరిస్థితులు గణనీయంగా క్షీణించాయని అమెరికా తెలిపింది. ఆ దేశాన్ని వెంటనే వీడాలని అక్కడున్న తమ పౌరులకు సూచించింది. ఇథియోపియాలో ప్రధానిగా అబియ్ అహ్మద్ అధికారం చేపట్టడానికి ముందు జాతీయ ప్రభుత్వంపై చాలా కాలం పాటు ఆధిపత్యం చెలాయించిన టిగ్రే దళాలను..రాజధాని ఆడిస్​ అబబాను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అమెరికా హెచ్చరించింది.

ALSO READ EV Charging Stations : 10 వేల ఈవీ ఛార్జింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేస్తాం..IOC చైర్మన్