Covid Deaths: యూరప్‌లో కరోనా… 4నెలల్లో 7లక్షల మృతులు కావొచ్చు – WHO

కరోనా మహమ్మారి యూరప్ దేశాల్లో చెలరేగిపోతుంది. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసులు, మరణాల్లో సగానికిపైగా యూరప్‌లోనే ఉంటున్నాయి. 53దేశాల్లో దాదాపు 49దేశాల....

Covid Deaths: యూరప్‌లో కరోనా… 4నెలల్లో 7లక్షల మృతులు కావొచ్చు – WHO

Covid Deaths

Covid Deaths: కరోనా మహమ్మారి యూరప్ దేశాల్లో చెలరేగిపోతుంది. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసులు, మరణాల్లో సగానికిపైగా యూరప్‌లోనే ఉంటున్నాయి. 53దేశాల్లో దాదాపు 49దేశాల హాస్పిటల్స్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూరప్‌ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం యూరప్‌ వ్యాప్తంగా 15లక్షల మంది కొవిడ్‌ బాధితులు మృతులవగా.. మార్చి నాటికి ఈ సంఖ్య 22లక్షలకు చేరొచ్చని అంచనా వేసింది. కేవలం వచ్చే 4నెలల్లోనే యూరప్‌లో మరో 7 లక్షల వరకూ కొవిడ్‌ మరణాలు పెరగొచ్చని WHO సూచిస్తుంది. మరో వైపు ఇన్‌ఫెక్షన్‌ నుంచి కాపాడుకునేందుకు సేఫ్టీ దారులు కూడా తగ్గిపోతున్నాయనేందుకు రుజువులు కూడా కనిపిస్తున్నాయట.

కొవిడ్ కారణంగా వారం రోజుల్లోనే 4వేల 200 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్‌‌తో పోలిస్తే కొవిడ్‌ మరణాల సంఖ్య రెట్టింపు అయింది. ముఖ్యంగా 25 దేశాల్లోని హాస్పిటల్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోనున్నట్లు పేర్కొంది. మార్చి 2022 నాటికి 49 దేశాల్లో కొవిడ్‌ ఐసీయూ వార్డుల కోసం మరింత ఒత్తిడి పెరగనుంది.

……………………………………. : ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలు.. ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న మంచు విష్ణు

‘ప్రస్తుతం యూరప్‌తో సహా సెంట్రల్‌ ఆసియాలో కొవిడ్‌ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. శీతాకాలం ముగిసేనాటికి జీవ మనుగడకు సవాలు విసురుతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా కలసికట్టుగా ప్రయత్నం చేయాలి’ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూరప్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ క్లూగే పేర్కొన్నారు. వైరస్‌‌ను కట్టడి చేసుకునేందుకు తీసుకునే చర్యలతోపాటు బూస్టర్‌ డోసుపైనా ఆయా దేశాలు దృష్టిపెట్టాలని సూచించారు.